RCB: 11 ఫ్యాన్స్ మంది మృతి.. బీజేపీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

by velandi.Saikiran |

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయోత్సవ ర్యాలీ నేపథ్యంలో.. జరిగిన తొక్కిసలాటలో ( Stampede ) ఏకంగా 11 మంది

RCB:  11 ఫ్యాన్స్ మంది మృతి.. బీజేపీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయోత్సవ ర్యాలీ నేపథ్యంలో.. జరిగిన తొక్కిసలాటలో ( Stampede ) ఏకంగా 11 మంది అభిమానులు ( RCB Fans) మృతి చెందారు. ర్యాలీ నిర్వహించిన తర్వాత చిన్నస్వామి స్టేడియంలోకి ( Chinnaswamy Stadium) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెటర్లు వెళ్లారు. అనంతరం అభిమానులు అందరూ స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే తొక్కి సలాట జరిగింది.

దీంతో... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులపై లాఠీచార్జి చేశారు పోలీసులు. ఈ తరుణంలోనే తొక్కిసలాట పెరిగి.. 11 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 30 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ సంఘటన నేపథ్యంలో... బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి కర్ణాటక బీజేపీ శాసనమండలి సభ్యులు చలవాడి నారాయణస్వామి ( BJP MLC Chalavadi Narayanaswamy ) వెళ్లారు.

ఈ సందర్భంగా బాధితులను పరామర్శించారు. తొక్కిసలాట ఘటనకు పూర్తి బాధ్యత సిద్దరామయ్య ప్రభుత్వం వహించాలని.. వాళ్ల వైఫల్యం వల్ల జరిగిందని మండిపడ్డారు. ఎంత మంది వస్తారో.. తెలియక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని ఫైర్ అయ్యారు. ఇది పూర్తిగా కర్ణాటక సర్కార్ వైఫల్యం అంటూ... ఆగ్రహం వ్యక్తం చేశారు.


Next Story