టీమిండియాకు BIG షాక్.. ఆరు వారాల పాటు కీలక ఆటగాడు దూరం?

by Gantepaka Srikanth |

ఇంగ్లండ్‌తో 5వ టీ20లో జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి టీమిండియా(Team India) ఆటగాడు సంజూ శాంసన్(Sanju Samson) చూపుడు వేలికి తగిలి గాయమైంది.

టీమిండియాకు BIG షాక్.. ఆరు వారాల పాటు కీలక ఆటగాడు దూరం?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్‌తో 5వ టీ20లో జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి టీమిండియా(Team India) ఆటగాడు సంజూ శాంసన్(Sanju Samson) చూపుడు వేలికి తగిలి గాయమైంది. నొప్పితో అతను వికెట్ కీపింగ్‌కు కూడా రాలేదు. కాగా, శాంసన్ వేలికి ఫ్రాక్చర్ అయిందని నాలుగు, ఆరు వారాల పటు బ్యాట్ పట్టలేరని బీసీసీఐ(BCCI) వర్గాలు తెలిపాయి. విశ్రాంతి తీసుకొని నేరుగా మార్చిలో ప్రారంభమయ్యే ఐపీఎల్‌లో ఆడొచ్చని పేర్కొంటున్నాయి. ఫిబ్రవరి 6 నుంచి ఇంగ్లాండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌, తర్వాత జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీకి శాంసన్‌ ఎంపిక కాని విషయం తెలిసిందే. కాగా.. నిన్న ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ భారీ విజయాన్ని అందుకుంది. 4-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.


వాంఖడే స్టేడియం(Wankhede Stadium)లో భారత బ్యాటర్లు, బౌలర్లు దూకుడుగా ఆడటంతో ఇంగ్లండ్ కేవలం 97 పరుగులకే చతికిలపడిపోయింది. భారత్ నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్(England) కేవలం 10.3 ఓవర్లలోనే ఆలౌట్ అయిపోయింది. ఫిల్ సాల్ట్ 55(23), జాకబ్ బేతల్ 10(7) మాత్రమే రెండంకలె స్కోరును సాధించారు. భారతీయ బౌలర్లలో షమీ అత్యధికంగా మూడు వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే, అభిషేక్ శర్మలు రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇక రవి బిష్ణోయ ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ చెలరేగాడు. కేవలం 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి రెండో అత్యంత వేగవంతమైన శతరం చేసిన భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించారు.

Next Story