ఆర్‌సీబీకి బిగ్ షాక్.. ఢిల్లీతో మ్యాచ్‌కు ఫిల్ సాల్ట్, రసిఖ్ సలామ్ దూరం

by Malleboina Mahesh |

ఢిల్లీతో మ్యాచ్‌కు ముందు ఆర్‌సీబీకి భారీ షాక్! గాయాల వల్ల ఫిల్ సాల్ట్, రసిఖ్ సలామ్ దూరం. రేపు రాత్రి ఢిల్లీ వేదికగా ఆర్‌సీబీ vs డిసి హోరాహోరీ పోరు.

ఆర్‌సీబీకి బిగ్ షాక్.. ఢిల్లీతో మ్యాచ్‌కు ఫిల్ సాల్ట్, రసిఖ్ సలామ్ దూరం
X

దిశ, వెబ్ డెస్క్: ఈ ఐపీఎల్ 2026 లో భారీ విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న ఆర్సీబీ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. సోమవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో జరగనున్న కీలక సమరానికి ముందు ఆర్‌సీబీ క్యాంపులో ఆందోళన మొదలైంది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్, యువ పేసర్ రసిఖ్ సలామ్ దార్ గాయాల కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. ఫిల్ సాల్ట్ ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడగా, రసిఖ్ గత మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ కండరాల నొప్పితో మైదానాన్ని వీడారు. వీరిద్దరూ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో, ఢిల్లీతో జరిగే పోరులో ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ వారిని దూరం పెట్టినట్లు ప్రకటించింది.

కీలక ఆటగాళ్లు దూరం కావడం ఆర్‌సీబీకి పెద్ద దెబ్బే అయినప్పటికీ, జట్టులోని ఇతర ఆటగాళ్లు ఆ బాధ్యతను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఫిల్ సాల్ట్ స్థానంలో యువ ఆటగాడు జాకబ్ బెతెల్, విరాట్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. మరోవైపు, రసిఖ్ స్థానంలో ఒక అదనపు స్పిన్నర్‌ను లేదా మరొక దేశీయ పేసర్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలంటే ఈ మ్యాచ్ గెలవడం ఆర్‌సీబీకి చాలా ముఖ్యం. ఈ ఉత్కంఠభరిత పోరు రేపు రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.

Next Story