- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇర్ఫాన్ పఠాన్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ సంచలన నిర్ణయం
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan)కు బీసీసీఐ (BCCI) బిగ్ షాకిచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan)కు బీసీసీఐ (BCCI) బిగ్ షాకిచ్చింది. ఈ మేరకు అతడిని ఐపీఎల్-2025 (IPL-2025) సీజన్ కామెంటరీ ప్యానల్ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ కొనసాగుతోన్న సమయంలో గ్రౌండ్‌లో ఉన్న ప్లేయర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు మేరకు ఇర్ఫాన్‌పై వేటు వేసినట్లుగా తెలుస్తోంది. అయితే, ఇటీవలే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ను పరువు తీశాడనే బీసీసీ దృష్టికి వచ్చింది. రోహిత్ శర్మ యావరేజ్ 6 పరుగులు మాత్రమేనని, తుది జట్టులో అతడికి చాన్స్ కష్టమేనని కామెంట్ చేశారు. అయితే, అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ఇర్ఫాన్ పఠాన్ క్షమాపణలు చెప్పాలని హల్‌చల్ చేశారు. చివరికి విషయం కాస్త బీసీసీఐకి చేరడంతో తాజాగా ఇర్ఫాన్ పఠాన్‌ను ఐపీఎల్-2025 కామెంటరీ ప్యానెల్ నుంచి తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది.






