- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2025 : ఐపీఎల్ అభిమానులకు భారీ షాక్
క్రికెట్ అభిమనులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్రికెట్ పండగ ఐపీఎల్ 2025(IPL 2025) వచ్చేనెల ప్రారంభం కానుంది.

దిశ, వెబ్ డెస్క్ : క్రికెట్ అభిమనులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్రికెట్ పండగ ఐపీఎల్ 2025(IPL 2025) వచ్చేనెల ప్రారంభం కానుంది. అయితే ఇంట్లో కూర్చొని ఐపీఎల్ తిలకించాలి అనుకునే ఫ్యాన్స్ కు భారీ షాక్ తగిలింది. ఇకపై ఉచితంగా ఐపీఎల్ మ్యాచులు చూడలేరు. 'జియో హాట్ స్టార్'(JioHotstar) లో ఐపీఎల్ చూడాలి అంటే సబ్ స్క్రయిబ్ చేసుకోవాల్సిందేనని సంస్థ స్పష్టం చేసింది. ఇందుకు గాను 3 నెలలకు రూ.149 కట్టాల్సిందే. ఆడ్ ఫ్రీ ఆప్షన్ కోసం అయితే ఏకంగా రూ.499 వదిలించుకోవాల్సిందే. కాగా గతేడాది జియో ఉచిత ఐపీఎల్ లైవ్(IPL Live) మ్యాచులు ప్రసారం చేయగా.. పోటీని తట్టుకునేందుకు హాట్ స్టార్ కూడా తప్పనిసరిగా ఉచితంగా ప్రసారం చేయాల్సి వచ్చింది. ఈ ఏడాది జియో-హాట్ స్టార్ జట్టు కట్టి.. అభిమానులు తప్పనిసరిగా డబ్బులు కట్టి మరీ మ్యాచులు చూడాల్సిన పరిస్థితి కల్పించారు.
కాగా జియో సినిమా(Jio Cinema)..డిస్నీ+హాట్ స్టార్(Disney+Hot Star) దిగ్గజ సంస్థలు జియోహాట్ స్టార్ పేరుతో ఒకే ఫ్లాట్ ఫామ్ గా వినియోగదారులను అలరించనున్నాయి. కొత్త ఫ్లాట్‌ఫామ్‌కు చెందిన కొత్త లోగోను కూడా రిలీజ్ చేశారు. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ల్లలో డిస్నీ+హాట్ స్టార్ యాప్ కొత్త లోగోతో జియో హాట్ స్టార్ పేరుకు మారిపోయింది. డిస్నీ+హాట్ స్టార్, జియో సినిమా రెండింటి ప్రస్తుతం యూజర్లు కొత్త ప్లాట్ ఫామ్ లో మారుతారు.
జియోహాట్‌స్టార్ ఫ్లాట్‌ఫామ్‌లో రెండు ఓటీటీల్లో ఉన్న లైబ్రరీ కాంటెంట్‌ను ప్రజెంట్ చేయనుంది. షోలో, సిరీస్‌లతో పాటు సినిమాలు కూడా ప్రేక్షకులు చూడవచ్చు. ఇతర అంతర్జాతీయ స్టూడియోలు, స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌లకు చెందిన కాంటెంట్ కూడా జియోహాట్‌స్టార్‌లో ప్రసారం కానున్నాయి. కొత్త స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌కు చెందిన వివరాలను జియో హాట్ స్టార్ షేర్ చేసింది. ఇందులో 50కోట్ల మంది వినియోగదారులు, 3లక్షల గంటల కంటెంట్ తో భారత మార్కెట్లో అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ గా నిలిచింది. స్పోర్ట్స్ లైవ్ కవరేజీలు కూడా అందుబాటులో ఉంటాయి.
ఒరిజినల్ కంటెంట్ తో పాటు డిస్నీ, ఎన్ బీసీ యూనివర్సల్ పీకాక్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హెచ్ బీ ఓ, పారామౌంట్ వంటి సంస్థల నుంచి అంతర్జాతీయ కంటెంట్కి కూడా ఈ కొత్త జియో హాట్ స్టార్ లో చూడవచ్చు. కొత్త స్ట్రీమింగ్ యాప్ లో అల్ట్రా హెచ్ డీ 4కే స్ట్రీమింగ్, మల్టీ యాంగిల్ వ్యూయింగ్, ఏఐ ఆధారిత ఇన్ సైట్స్, రియల్ టైమ్ స్టాట్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. జియో హాట్ స్టార్ ను ఫ్రీగా చూడవచ్చు, అయితే యాడ్స్ ప్లే అవ్వడంతో పాటు పెయిడ్ వర్షన్ లోని కొన్ని కంటెంట్స్ చూడలేకపోవచ్చు. అలాంటి వారి కోసం కొత్త ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ప్లానింగ్ రూ.149నుంచి పెయిడ్ ప్లాన్ అందుబాటులోకి తెచ్చారు.
ఇండియాకు చెందిన పది భాషల్లో జియోహాట్‌స్టార్ కాంటెంట్ అందుబాటులో ఉంటుంది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ), నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్ సీఎల్ టీ) గతు ఏడాది ఆగస్టులో డిస్నీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ విలీనానికి ఆమోదం తెలిపాయి. విలీనంలో భాగంగా రిలయన్స్ కు ప్రత్యక్షంగా 16శాతం, వయాకామ్ 18మీడియా వ్యాపారం ద్వారా 47శాతం వాటా దక్కింది. డిస్నీకి 37శాతం వాటా ఉంది.






