సౌతాఫ్రికా రెండో వన్డే ముందు బౌలర్ హర్షిత్ రాణాకు బిగ్ షాక్!

by Malleboina Mahesh |

యువ భారత బౌలర్ హర్షిత్ రాణాకు దక్షిణాఫ్రికా రెండో వన్డే ముందు బిగ్ షాక్ తగిలింది.

సౌతాఫ్రికా రెండో వన్డే ముందు బౌలర్ హర్షిత్ రాణాకు బిగ్ షాక్!
X

దిశ, వెబ్ డెస్క్: యువ భారత బౌలర్ హర్షిత్ రాణా (Harshit Rana)కు దక్షిణాఫ్రికా రెండో వన్డే ముందు షాక్ తగిలింది. ICC ప్రవర్తనా నియమావళి (Code of Conduct)ని ఉల్లంఘించినందుకు గాను అతనికి మందలింపు (Reprimand) శిక్షను విధిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిర్ణయం తీసుకుంది. క్రికెట్ మైదానంలో ఆటగాళ్ల ప్రవర్తనకు సంబంధించి రాణా నిబంధనలు అతిక్రమించి నట్లు తేలింది. రాంచీ వేదికగా జరిగిన మొదటి వన్డేలో ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన హర్షిత్ రానా.. దక్షిణాఫ్రికా బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ అవుట్ తర్వాత ఆవేశాన్ని చూపించాడు. దీంతో అతను ICC ప్రవర్తనా నియమావళిని క్రాస్ చేసినందుకు అతనిపై చర్యలు తీసుకుంది. ఏదేమైనా ICC మందలింపుతో రాణాకు ఒక డీ మెరిట్ పాయింట్ కూడా జమయ్యే అవకాశం ఉంది. రాబోయే ముఖ్యమైన మ్యాచ్ ముందు యువ బౌలర్‌కు ఈ విధమైన హెచ్చరిక అందడం జట్టు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Next Story