పాకిస్తాన్‌తో ఫైనల్ మ్యాచ్.. భారత్‌కు భారీ ఎదురుదెబ్బ

by Gantepaka Srikanth |

ఆసియా కప్ -2025లో భాగంగా కాసేపట్లో భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య రసవత్తర ఫైనల్‌ మ్యాచ్‌ జరుగబోతోంది.

పాకిస్తాన్‌తో ఫైనల్ మ్యాచ్.. భారత్‌కు భారీ ఎదురుదెబ్బ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ -2025లో భాగంగా కాసేపట్లో భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య రసవత్తర ఫైనల్‌ మ్యాచ్‌ జరుగబోతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ అనంతరం జట్టులో చేసిన మార్పులను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రివీల్ చేశారు. గాయం కారణంగా ఫైనల్ మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా(Hardik Pandya) దూరం అయ్యాడని చెప్పారు. పాండ్యా స్థానంలో రింకూ సింగ్‌కు చోటు కల్పించినట్లు పేర్కొన్నారు. అత్యంత కీలకమైన మ్యాచ్‌లో హార్దిక్ లేకపోవడం భారత్‌కు భారీ ఎదురుదెబ్బ అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

భారత్ : అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్‌కీపర్), శివమ్ దూబె, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్‌ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

పాకిస్తాన్: సాహిబ్‌జాదా ఫర్హాన్, ఫకార్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా (కెప్టెన్), హుస్సేన్ తలాత్, మహ్మద్ హారిస్ (వికెట్‌కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రాఫ్, షాహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.

Next Story