రాజస్థాన్‌ రాయల్స్‌కు భారీ షాక్.. ఆ స్టార్ స్పిన్నర్ దూరం

by Dishanational3 |
రాజస్థాన్‌ రాయల్స్‌కు భారీ షాక్.. ఆ స్టార్ స్పిన్నర్ దూరం
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2024‌లో రాజస్థాన్ రాయల్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు లెగ్ స్పిన్నర్, ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ జంపా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో అతను లీగ్‌కు అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది. జంపా ఐపీఎల్-2024 ఆడటం లేదని అతని మేనేజర్ గురువారం అంతర్జాతీయ మీడియాకు తెలిపాడు. గతేడాది వన్డే వరల్డ్ కప్‌ నుంచి జంపా తీరిక లేకుండా క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. గత వేలంలో జంపాను రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ ఈ సీజన్‌కు అతన్ని అంటిపెట్టుకుంది. గత సీజన్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన అతను 8 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ఐపీఎల్‌లో 20 మ్యాచ్‌లు ఆడిన అతను 29 వికెట్లు తీసుకున్నాడు. ఇప్పటికే యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ దూరమవ్వగా.. ఆడమ్ జంపా కూడా అందుబాటులో లేకపోవడం రాజస్థాన్ బౌలింగ్ దళానికి భారీ లోటే అని చెప్పొచ్చు. ఈ నెల 24న లక్నోతో రాజస్థాన్ తొలి మ్యాచ్ ఆడనుంది.


Next Story

Most Viewed