- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. ఆ ఇద్దరు కూడా చాంపియన్స్ ట్రోఫీ నుంచి ఔట్

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు వరుస ఎదురుదెబ్బలు తగలుతున్నాయి. ఇప్పటికే స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. మరో ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ గురువారం అనూహ్యంగా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి భారీ షాక్ ఇచ్చాడు. స్టోయినిస్ ఇచ్చిన దెబ్బ నుంచి కోలుకోకముందే మరో షాక్ తగిలింది. చాంపియన్స్ ట్రోఫీ నుంచి ఆసిస్ కెప్టెన్ కమిన్స్, పేసర్ హేజల్‌వుడ్ దూరమయ్యారు. గాయాల కారణంగా ఐసీసీ టోర్నీ నుంచి తప్పుకున్నట్టు సెలెక్షన్ ప్యానెల్ చైర్మన్ జార్జ్ బెయిలీ వెల్లడించారు. కమిన్స్ చీల మండలం గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. హేజల్‌వుడ్ తుంటి సమస్యతో బాధపడుతున్నాడు. వరుస షాక్‌ల నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టులో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నలుగురు స్టార్లను కోల్పోవడం టోర్నీలో ఆ జట్టుపై భారీ ప్రభావం చూపనుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఆ నలుగురి స్థానాలను క్రికెట్ ఆస్ట్రేలియా ఇంకా భర్తీ చేయలేదు. కమిన్స్ గైర్హాజరీలో స్మిత్, హెడ్‌లలో ఒకరిని కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉంది.