- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BGT Fever : ఆసీస్ మీడియాలో ‘కింగ్ కోహ్లి’ హవా..
by Sathputhe Rajesh |
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వేళ ఆస్ట్రేలియా మీడియాలో విరాట్ కోహ్లి మేనియా కొనసాగుతోంది.

X
దిశ, స్పోర్ట్స్ : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వేళ ఆస్ట్రేలియా మీడియాలో విరాట్ కోహ్లి మేనియా కొనసాగుతోంది. ఫస్ట్ టెస్ట్ కోసం ఇప్పటికే కోహ్లి పెర్త్ చేరుకున్నాడు. అయితే ఆసీస్ మీడియా ఫస్ట్ పేజీల్లో కోహ్లి పేరు మార్మోగింది. అక్కడి మీడియా హిందీ, పంజాబీ భాషల్లోనూ హెడ్ లైన్స్ ప్రచురించింది. యశస్వీ జైస్వాల్, పంత్‌ల గురించి సైతం కథనాలను ప్రచురించింది. అయితే ఆస్ట్రేలియాలో యాషెస్ సిరీస్‌కు గతంలో ఫుల్ క్రేజ్ ఉండగా ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆ రేంజ్‌లో ఆదరణ పొందింది. దీంతో అక్కడి న్యూ యాషెస్ సిరీస్ అంటూ ఈ టోర్నీని కీర్తించాయి. యశస్వి జైస్వాల్‌ను ‘న్యూ కింగ్’ అంటూ ఆసీస్ పత్రికలు కీర్తించాయి. ‘యుగోంకి లడాయి’ అని పెద్ద అక్షరాలతో శీర్షికలు ప్రచురించడంతో భారత అభిమానులు ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Next Story






