- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BGT 2024 : స్వదేశానికి హుటాహుటిన గంభీర్.. కారణమిదే..!
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

దిశ, స్పోర్ట్స్ : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీంఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సడెన్‌గా స్వదేశానికి తిరిగి వస్తున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో తాను ఇంటికి వెళ్తున్నట్లు గంభీర్ బీసీసీఐకి సమాచారం అందించినట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. గంభీర్ తిరిగి ఆడిలైడ్ టెస్ట్ కన్నా ముందే టీంఇండియాతో కలవనున్నట్లు సమాచారం. గంభీర్ రిక్వెస్ట్‌కు బీసీసీఐ సైతం ఓకే చెప్పినట్లు తెలిసింది. పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ కోసం బుధవారం టీంఇండియా కాన్‌బెర్రాకు ప్రయాణించాల్సి ఉంది. అక్కడ జరిగే ప్రాక్టీసు మ్యాచ్‌కు గంభీర్ గైర్హాజరు కానున్నారు. శనివారం నుంచి ప్రాక్టీస్ మ్యాచ్ ప్రారంభం కానుంది. తన భార్య రెండో సంతానం కారణంగా రోహిత్ శర్మ తొలి టెస్ట్‌కు దూరం ఉన్నారు. తాజాగా భారత జట్టుతో హిట్ మ్యాన్ కలిశాడు. తొలి టెస్ట్ నాలుగో రోజు రోహిత్, గంభీర్ డ్రెస్సింగ్ రూమ్‌లో పక్కపక్కనే కూర్చొని కనిపించారు. అయితే గంభీర్ సడెన్ టూర్ వెనక అసలు కారణం మాత్రమ తెలియరాలేదు.






