రోహిత్, కోహ్లీ లేకపోయినా టీమిండియాను లైట్ తీసుకోలేం: బెన్ స్టోక్స్

by Phanindra |

రోహిత్, కోహ్లీ లేకపోయినా టీమిండియాను లైట్ తీసుకోలేమని బెన్ స్టోక్స్ అన్నాడు. ఎంతోమంది కుర్ర బ్యాటర్లు భారత్‌లో రెడీగా ఉన్నారన్నాడు.

రోహిత్, కోహ్లీ లేకపోయినా టీమిండియాను లైట్ తీసుకోలేం: బెన్ స్టోక్స్
X

దిశ, స్పోర్ట్స్: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోయినా సరే టీమిండియాను లైట్‌గా తీసుకోబోమని ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పష్టం చేశాడు. భారత్‌ బ్యాటింగ్‌లో ఎంతో లోతుందని, కొత్త కుర్రాళ్లను కూడా తక్కువ అంచనా వేయలేమని అన్నాడు. ‘మేం టెస్టుల్లో ప్రత్యర్థిని ఓడించడానికే ప్రయత్నిస్తాం. రోహిత్, కోహ్లీ తప్పుకోవడం ఆ టీంకు చాలా పెద్ద లోటు. ఇంతకాలం టీమిండియా విజయాల్లో వారి పాత్ర చాలా కీలకం. కానీ భారత్‌లో బ్యాటర్లకు కొదవ లేదు. నేను ఐపీఎల్ ఆడినప్పుడు ఇదే విషయం గమనించా. అందుకే వాళ్ల ఇద్దరు బడా ప్లేయర్లు రిటైరయినా.. భారత్ నుంచి వచ్చే ఏ టీంనూ లైట్‌గా తీసుకోకూడదు’ అని స్టోక్స్ చెప్పుకొచ్చాడు.

జోఫ్రా ఆర్చర్‌కు గాయం..

భారత్‌తో సిరీస్ కోసం రెడీ అవుతున్న ఇంగ్లండ్‌కు పెద్ద ఎదురు దెబ్బ. ఆ టీం స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ గాయంతో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు అతని పరిస్థితిని మరోసారి పరిశీలించి, ఆర్చర్ ఆడతాడా? లేదా? అనే విషయంపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఒక నిర్ణయం తీసుకోనుంది.

Next Story