IPL 2026 : ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాకిచ్చిన ఇంగ్లాండ్ క్రికెటర్

by Harish |

IPL 2026 : ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాకిచ్చిన ఇంగ్లాండ్ క్రికెటర్
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డక్కెట్ తన ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాకిచ్చింది. ఐపీఎల్-2026 నుంచి వైదొలిగాడు. ఇంగ్లాండ్ కెరీర్‌పై దృష్టి పెట్టడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు.‘ఐపీఎల్ నుంచి విత్ డ్రా అవ్వాలనే కఠినమైన నిర్ణయం తీసుకున్నా. ఈ నిర్ణయం అంత సులభంగా తీసుకున్నది కాదు. చాలా ఆలోచించాను. వేసవిలో నేను ఇంగ్లాండ్ ప్రాతినిధ్యం వహించాలంటే మానసికంగా, శారీరకంగా ఉన్నత స్థితిలో ఉండాలి. ఢిల్లీలోని ప్రతి ఒక్కరికీ నేను క్షమాపణలు చెబుతున్నా.’అని డక్కెట్ తెలిపాడు. డక్కెట్ నిర్ణయంతో అతను రాబోయే రెండు వేలాల్లో పాల్గొనకుండా నిషేధానికి గురవుతాడు. అలాగే, 2027, 2028 సీజన్లలో కూడా ఆడలేడు. వేలంలో ఢిల్లీ అతన్ని రూ.2 కోట్లు సొంతం చేసుకుంది. ఓపెనర్‌గా డక్కెట్ తమ కీలకంగా మారుతాడని ఆశించింది. అయితే, అనూహ్యంగా డక్కెట్ ఐపీఎల్ నుంచి విత్ డ్రా అవ్వడం ఆ జట్టుకు భారీ దెబ్బే.


Next Story