- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టామ్ కర్రన్, సామ్ కర్రన్‌ల సోదరుడికి జింబాబ్వే జట్టులో చోటు
ఇంగ్లాండ్ ప్లేయర్లు టామ్ కర్రన్, సామ్ కర్రన్‌ల సోదరుడు బ్యాటర్ బెన్ కర్రన్‌కు జింబాబ్వే జాతీయ జట్టులో చోటు దక్కింది.

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ ప్లేయర్లు టామ్ కర్రన్, సామ్ కర్రన్‌ల సోదరుడు బ్యాటర్ బెన్ కర్రన్‌కు జింబాబ్వే జాతీయ జట్టులో చోటు దక్కింది. అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు జింబాబ్వే క్రికెట్ బోర్డు సోమవారం జట్టును ప్రకటించగా.. బెన్ తొలిసారిగా పిలుపు అందుకున్నాడు. దీంతో కర్రన్ కుటుంబం నుంచి మరో ప్లేయర్ అంతర్జాతీయ అరంగేట్రం చేయబోతున్నాడు. కర్రన్ కుటుంబ క్రికెట్ వారసత్వం జింబాబ్వేలోనే మొదలైంది. వారి తాత కెవిన్ పాట్రిక్ కర్రన్ జింబాబ్వేలో ఫస్ట్ క్లాస్ క్రికెటర్. అతని కుమారుడు కెవిన్ మాల్కం కర్రన్ జింబాబ్వేకు ప్రాతినిధ్యం వహించాడు. 1980లో 11 వన్డేలు ఆడాడు. ఆ తర్వాత జాతీయ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు.
ముగ్గురు అన్నదమ్ములు(టామ్, బెన్, సామ్) ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. జింబాబ్వేలోనే పెరిగినప్పటికీ ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్‌కు వచ్చారు. అక్కడ దేశవాళీలో రాణించిన టామ్, సామ్ ఇంగ్లాండ్ జట్టులో చోటు సంపాదించి కీలక ప్లేయర్లుగా ఎదిగారు. మరోవైపు, బెన్ కూడా అక్కడి దేశవాళీ ఆడాడు. 2022 సీజన్‌లో జింబాబ్వేకు తిరిగొచ్చిన అతను అక్కడి దేశవాళీ టోర్నీలో సత్తాచాటాడు. ఈ ఏడాది 50 ఓవర్ల ఫార్మాట్, రెడ్ బాల్ ఫార్మాట్‌లో అదరగొట్టి జాతీయ జట్టు నుంచి పిలుపు అందుకున్నాడు. బెన్‌తోపాటు పేసర్ న్యూమాన్ న్యామ్‌హురి కూడా తొలిసారి జట్టులో చోటు సాధించాడు.






