- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతను గంభీర్ మనిషి.. బాగా ఆడకపోయినా జట్టులో ఉంటాడు : మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్‌లకు ఎంపిక చేసిన రెండు భారత జట్లలోనూ యువ పేసర్ హర్షిత్ రాణాకు స్థానం దక్కడంపై మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు.

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్‌లకు ఎంపిక చేసిన రెండు భారత జట్లలోనూ యువ పేసర్ హర్షిత్ రాణాకు స్థానం దక్కడంపై మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. తన యూట్యూబ్ చానెల్‌లో జట్టు సెలెక్షన్‌ను విశ్లేషించిన క్రిష్.. ముఖ్యంగా హర్షిత్ రాణా ఎంపికపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ యువ పేసర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మనిషి అంటూ విమర్శించాడు. ‘సెలెక్షన్ ప్లేయర్లను కూడా అయోమయానికి గురి చేస్తోంది. ఎంపిక ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. ఒక్కసారి యశస్వి జైశ్వాల్ ఉంటాడు. ఓ సారి ఉండడు. కానీ, శాశ్వత సభ్యుడు ఎవరైనా ఉన్నారంటే అది హర్షిత్ రానా. జట్టులో అతను ఎందుకు ఉన్నాడో తెలియదు. బాగా ఆడుతున్న వారిని ఎంపిక చేయకండి. హర్షిత్ రాణా గంభీర్ మనిషి. అతను ఎప్పుడూ సెలెక్ట్ అవుతాడు. 2027 వరల్డ్ కప్ లక్ష్యంగా జట్టును నిర్మించాలనుకుంటున్నారు.కానీ,నాకు అలా అనిపించడం లేదు. హర్షిత్ రాణాలాంటి వాళ్లను తీసుకుంటే ట్రోఫీ ఆశలు మర్చిపోండి.’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. మైదానంలో హర్షిత్ రాణా సినిమా స్ట్రైల్‌లో జిమ్మిక్కులు చేస్తాడని, అలాంటి వాటితో ఉపయోగం లేదన్నాడు. ఆ ప్రవర్తన మంచిది కాదని, బాగా బౌలింగ్ చేయాలని సూచించాడు.






