- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL ఫ్రాంఛైజీలకు BCCI బంపరాఫర్.. వేలంలో అమ్ముడుపోని ప్లేయర్లకు పండగే
భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) సరిహద్దుల్లో ఉద్రిక్తత కారణంగా ఐపీఎల్-2025 (ఉఊణ-2025)ను వారం రోజుల వాయిదా వేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) సరిహద్దుల్లో ఉద్రిక్తత కారణంగా ఐపీఎల్-2025 (ఉఊణ-2025)ను వారం రోజుల వాయిదా వేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయా జట్లలో ఉన్న విదేశీ ఆటగాళ్లు భద్రత దృష్ట్యా భయంతో తమ సొంత దేశాలకు వెళ్లిపోయారు. అయితే, దాయాది పాక్‌తో కాల్పులు ఒప్పందం జరగడంతో టోర్నీని తిరిగి మే 17 నుంచి పున:ప్రారంభించబోతున్నట్లుగా బీసీసీఐ ప్రకటించింది.
ఈ క్రమంలోనే స్వదేశాలకు వెళ్లిన ఆటగాళ్లంతా ఒక్కొక్కరుగా టోర్నీలో పాల్గొనేందుకు ఇండియాలో ల్యాండ్ అవుతున్నారు. మరికొందరు రాలేమని వారి వారి ఫ్రాంఛైజీ యాజమాన్యాలకు తెలిపారు. దీంతో ఆయా జట్లలో టోర్నీకి గైర్హాజరైన ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసే విషయంలో IPL ఫ్రాంఛైజీలకు బీసీసీఐ బంపరాఫర్ ఇచ్చింది. మెగా ఆక్షన్‌లో అమ్ముడుపోని ఆటగాళ్లతో ఆయా ఫ్రాంఛైజీలు ఒప్పందాలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇప్పటికే ముంబై జట్టు ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్ స్థానాల్లో జానీ బెయిర్‌స్టో, రిచర్డ్ గ్లీసన్‌తో ఒప్పందం చేసుకుంది. ప్లేఆఫ్స్ రేసు దగ్గర పడిన వేళ తాాజాగా, బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో పలు జట్లకు భారీగా లబ్ధి చేకూరే చాన్స్ ఉంది.






