IPL 2025 : వారికి బీసీసీఐ బిగ్ అలర్ట్

by Muthe.Rajitha |

IPL 2025 : వారికి బీసీసీఐ బిగ్ అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 20259(IPL 2025) సీజన్ మంచి జోరులో నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ లో భాగస్వామ్యం అయిన అన్ని జట్ల ఓనర్లకు బీసీసీఐ(BCCI) బిగ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్(Hyderabad) కు చెందిన ఓ బడా వ్యాపారి ఐపీఎల్ జట్ల ఓనర్లను, ప్లేయర్లను, కోచ్ లను, కామెంటేటర్లను, సిబ్బందిని ట్రాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు బాంబ్ పేల్చింది. ఆ వ్యాపారి వారందరినీ ఫిక్సింగ్(Fixing) లోకి దించే పనిలో పడ్డారని.. అన్ని జట్లు, ఆటగాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అతడికి అనేకమంది బుకీలతో సంబంధాలు ఉన్నట్టు గుర్తించినట్టు, ఏ జట్టు ఓనర్లనైనా.. ఆటగాళ్లనైనా అతడు సంప్రదిస్తే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని ఆదేశించినట్టు క్రిక్ బజ్(CrickBuzz) వార్తా కథనాలు వెలువరించింది. దీంతో క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తింది. ఇక అన్ని జట్లు తమ ప్లేయర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.

Next Story