- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కప్పు ఇస్తావా? కంప్లయింట్ ఇవ్వాలా?.. మొహ్‌సిన్ నఖ్వీకి బీసీసీఐ లేఖ
కప్పు ఇస్తావా? కంప్లయింట్ ఇవ్వాలా? అంటూ మొహ్‌సిన్ నఖ్వీకి బీసీసీఐ లేఖ రాసింది. ఆసియా కప్ ట్రోఫీ కోసం ఐసీసీకి ఫిర్యాదు చేస్తామంది.

దిశ, స్పోర్ట్స్: బీసీసీఐ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ మొహ్‌సిన్ నఖ్వీ మధ్య ఆసియా కప్ ట్రోఫీ వివాదం ముదురుతోంది. ట్రోఫీని ఇప్పటికీ భారత్‌కు నఖ్వీ అప్పగించకపోవడంపై బీసీసీఐ సీరియస్ అవుతోంది. ఈ క్రమంలోనే తకు ట్రోఫీ వెంటనే అప్పగించాలంటూ అధికారికంగా నఖ్వీకి లేఖ రాసింది. దీనిపై సమాధానం కోసం వెయిట్ చేస్తున్నామని, నఖ్వీ కనుక స్పందించకపోతే ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్తామని బీసీసీఐ సెక్రెటరీ దేవాజిత్ సైకియా తెలిపాడు. ఈ అంశంలో తాము పద్ధతి ప్రకారం ముందుకు సాగుతున్నామన్నాడు.
ప్రస్తుతం ఆసియా కప్ ట్రోఫీని దుబాయ్‌లోని ఏసీసీ ఆఫీసులో ఉంచారు. నఖ్వీ చేతుల మీదుగా అవార్డు అందుకోవడానికి టీమిండియా నిరాకరించడంతో దాన్ని తీసుకెళ్లి ఏసీసీ ఆఫీసులో దాచిపెట్టేశాడతను. ట్రోఫీ స్వాధీనం చేయాలని కోరితే.. బీసీసీఐ ప్రతినిధులు దుబాయ్ వచ్చి తన చేతుల మీదుగానే ట్రోఫీ అందుకోవాలని వాదిస్తున్నాడు. ఈ క్రమంలోనే ట్రోఫీని భారత్‌కు అప్పగించాలంటూ బీసీసీఐ సెక్రెటరీ, ఏసీసీలో బీసీసీఐ ప్రతినిధి రాజీవ్ శుక్లాతోపాటు శ్రీలకం, అఫ్గాన్ క్రికెట్ బోర్డులు కూడా నఖ్వీకి లేఖ రాసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ వివాదం ఐసీసీ మీటింగ్ వరకూ వెళ్తుందని నిపుణులు భావిస్తున్నారు.






