కప్ ఇచ్ఛేయ్యండి : నఖ్వీకి బీసీసీఐ వార్నింగ్

by Muthe.Rajitha |

ఆసియన్ క్రికెట్ కౌన్సిల్(ACC) చీఫ్ మొహిన్ నఖ్వీకి భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) వార్నింగ్ ఇచ్చింది.

కప్ ఇచ్ఛేయ్యండి : నఖ్వీకి బీసీసీఐ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఆసియన్ క్రికెట్ కౌన్సిల్(ACC) చీఫ్ మొహిన్ నఖ్వీకి భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) వార్నింగ్ ఇచ్చింది. నఖ్వీ విషయంలో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైన బీసీసీఐ... ఆసియా కప్ ట్రోఫీని భారత్‌కు అప్పగించాలంటూ మెయిల్ పంపింది. ఇవ్వకపోతే ICCకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించింది. నఖ్వీ నుంచి స్పందన రాకపోతే విషయాన్ని ఐసీసీ ఎదుటే తేల్చుకుంటామని బీసీసీఐ సెక్రటరీ సైకియా తెలిపారు. అయితే సెప్టెంబర్ లో జరిగిన ఆసియా కప్ 2025 టోర్నీ ఫైనల్ లో భారత్ పాక్ పై విజయం సాధించింది.

అయితే ఏసీసీ చీఫ్ నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ తీసుకోవడానికి భారత క్రికెటర్లు నిరాకరించడంతో... ఆయన ట్రోఫీని వెంట తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ట్రోఫీ ఆయన వద్దే ఉండగా.. తిరిగి ఇచ్చేయాలని భారత్ పట్టుబడుతోంది.

Next Story