- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్తాన్ వెళ్లనున్న బీసీసీఐ ఉపాధ్యక్షుడు
భారత్ వేదికగా 2026లో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌కు పాకిస్తాన్ పురుషుల జట్టు, 2025లో జరుగనున్న వుమెన్స్ వరల్డ్ కప్‌కు మహిళా జట్లు కూడా ఇండియాకు రాబోమని స్పష్టం చేశాయి.

- లాహోర్‌లో రెండో సెమస్ వీక్షించనున్న రాజీవ్ శుక్లా
దిశ, స్పోర్ట్స్: బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పాకిస్తాన్ వెళ్లనున్నారు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బుధవారం లోహోర్‌లోని గఢాఫీ స్టేడియం వేదికగా న్యూజీలాండ్, సౌతాఫ్రికా జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ను చూడటానికి రాజీవ్ శుక్లా లాహోర్ వెళ్తారని బోర్డు తెలిపింది. బీసీసీఐ ప్రతినిధిగా రాజీవ్ శుక్లా పాకిస్తాన్ వెళ్లనున్నట్ల సమాచారం.కాగా, రెండు రోజుల పాటు లాహోర్‌లోనే ఉండి.. మార్చి 6న ఆయన తిరిగి దుబాయ్ వెళ్లనున్నారు. 2023లో పాకిస్తాన్ ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇచ్చినప్పుడు కూడా రాజీవ్ శుక్లా పాకిస్తాన్ వెళ్లారు. అప్పుడు ఆయన వెంట బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ కూడా ఉన్నారు. కాగా, భారత జట్టు పాకిస్తాన్‌లో పర్యటించేందుకు నిరాకరించడంతో చాంపియన్స్ ట్రోఫీని హైబ్రీడ్ పద్దతిలో నిర్వహిస్తున్నారు. భారత జట్టు తన అన్ని మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా ఆడుతోంది. ఐసీసీ కూడా 2028 వరకు ఇండియా, పాకిస్తాన్‌లో జరిగే అన్ని మ్యాచ్‌లను హైబ్రీడ్ మోడల్‌లో జరిపేందుకు ఒప్పుకుంది. భారత్ వేదికగా 2026లో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌కు పాకిస్తాన్ పురుషుల జట్టు, 2025లో జరుగనున్న వుమెన్స్ వరల్డ్ కప్‌కు మహిళా జట్లు కూడా ఇండియాకు రాబోమని స్పష్టం చేశాయి.






