- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పహల్గామ్ ఉగ్రదాడి.. ఆ టోర్నీ నుంచి టీమ్ ఇండియా తప్పుకుంటుందా?
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దిశ, స్పోర్ట్స్ : పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రభావం క్రికెట్‌పై కూడా పడనుంది. ఇప్పటికే భారత్, పాక్ జట్ల మధ్య దైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్‌లో మాత్రం ఎదురుపడుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్‌తో క్రికెట్ సంబంధాలు అన్ని తెంచుకోవాలన్న డిమాండ్ వ్యక్తమవుతున్నది. పాక్‌తో ఆడొద్దని భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కూడా ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అలాగే, ఐసీసీ ఈవెంట్లలో భారత్, పాక్ జట్లను ఒకే గ్రూపులో చేర్చొద్దని బీసీసీఐ ఐసీసీకి లేఖ రాసినట్టు వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది జరగాల్సిన ఆసియా కప్‌పై అనుమానాలు నెలకొన్నాయి. ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్ వద్దే ఉన్నాయి. అయితే, తటస్థ వేదికగా ఈవెంట్ జరగనుంది. ఇంకా వేదిక ఖరారు కాలేదు. సెప్టెంబర్‌లో ఆసియా కప్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే, పహల్గామ్ ఘటన తర్వాత బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆసియా కప్‌ను రద్దు చేసుకోవాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏ సిరీస్ అయినా లేదా టోర్నమెంట్ అయినా ఆడాలన్నా భారత ప్రభుత్వం అనుమతితోనే బీసీసీఐ టీమిండియాను పంపుతుంది. ఇప్పుడు పాక్‌తో క్రికెట్ సంబంధాలన్నీ తెంచుకోవాలన్న డిమాండ్ వ్యక్తమవుతున్న నేపథ్యంలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవచ్చు. ఇదే జరిగితే భారత్ లేకుండా ఆసియా కప్ జరగడం కష్టమే.






