- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఎంపిక?.. తిలక్, నితీశ్‌కు చోటు దక్కుతుందా?
టీ20 ప్రపంచకప్-2026కు శనివారం బీసీసీఐ భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది.

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7 నుంచి మొదలుకానుంది. ఈ మెగా టోర్నీ కోసం బీసీసీఐ శనివారం భారత జట్టును ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ శనివారం సమావేశం కానుంది. ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన భారత జట్టు వివరాలను అగార్కర్ ప్రకటిస్తారు. ఈ ప్రపంచకప్‌కు ముందు టీమిండియా.. న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ జనవరి 21 నుంచి ప్రారంభంకానుంది. వరల్డ్ కప్‌కు ఖరారు చేసే భారత జట్టే కివీస్‌తో సిరీస్‌లోనూ పాల్గొంటుందని జాతీయ మీడియా తెలిపింది. సౌతాఫ్రికాతో ఆడిన ప్లేయర్లే దాదాపు ప్రపంచకప్ జట్టులో ఉండనున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు చోటు ఖాయమే. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి స్థానంపై సందిగ్ధం నెలకొంది. స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, నితీశ్ మధ్య పోటీ ఉండనున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.






