బీసీసీఐ కూడా ఫాలో అవ్వాల్సిందే.. క్రీడా గవర్నెన్స్ బిల్లు తెస్తున్న కేంద్రం

by Phanindra |

బీసీసీఐ కూడా ఫాలో అయ్యేలా ఒక కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోంది. నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లును అందరూ ఫాలో అవ్వాల్సిందే.

బీసీసీఐ కూడా ఫాలో అవ్వాల్సిందే.. క్రీడా గవర్నెన్స్ బిల్లు తెస్తున్న కేంద్రం
X

దిశ, స్పోర్ట్స్: ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డు బీసీసీఐని జాతీయ క్రీడా గవర్నెన్స్ కిందకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం నాడు పార్లమెంటులో నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే బీసీసీఐ కూడా ఈ చట్టం అమలు చేయాల్సిందే.

దేశవ్యాప్తంగా క్రీడా కార్యక్రమాలను మెయింటైన్ చేయడం, నిర్వహించడం, క్రీడా వ్యవస్థలను బలోపేతం చేసేందుకే ఈ కొత్త బిల్లును కేంద్ర తెస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు. బీసీసీఐ వంటి క్రీడా ఫెడరేషన్ల ఎన్నికలపై కూడా దృష్టి పెట్టి, క్రీడాకారుల సంక్షేమానికి ఈ ఫెడరేషన్లు బాధ్యత తీసుకునేలా చేస్తుందీ చట్టం. ఈ బిల్లు పాసైతే అన్ని క్రీడా సంఘాల్లాగే బీసీసీఐ కూడా ఈ చట్టాన్ని అనుసరించాల్సి వస్తుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

Next Story