చీఫ్ సెలెక్టర్‌ అజిత్ అగార్కర్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం

by Harish |

చీఫ్ సెలెక్టర్‌ అజిత్ అగార్కర్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం
X

దిశ, స్పోర్ట్స్ : బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ పదవీకాలం ఈ ఏడాది జూన్‌తో ముగియనుంది. అయితే, అతని విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా అతన్ని కొనసాగించాలని చూస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అతని పదవీకాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగించే అవకాశాలు ఉన్నాయని తెలిపాయి. అదే జరిగితే అతను వచ్చే ఏడాది జూన్ వరకు అతను చీఫ్ సెలెక్టర్‌గా కొనసాగుతాడు. ‘అగార్కర్ హయాంలో జట్టు పరివర్తన చెందింది. అలాగే, అతను సాహసోపేత నిర్ణయాలను నిర్భయంగా తీసుకున్నాడు. అతన్ని కొనసాగించాలని బోర్డు భావిస్తుంది. ఐపీఎల్ సమయంలో బీసీసీఐ అధికారులు అతనితో మాట్లాడుతారు.’అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. 2023లో అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్‌గా పగ్గాలు చేపట్టాడు. అతని హయాంలో భారత జట్టు అద్భుత విజయాలు అందుకుంది. 2024, 2026లలో వరుసగా టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. 2025‌లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. 2023 వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ వరకూ వెళ్లింది. ఈ నేపథ్యంలోనే 2027 వన్డే వరల్డ్ కప్ వరకు అతని సేవలను వినియోగించుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది.


Next Story