కోహ్లీని అప్పుడు అడగాల్సింది.. విరాట్ టెస్టు రిటైర్మెంట్‌‌పై మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

by Harish |

ఇంగ్లాండ్ పర్యటనకు ముందు విరాట్ కోహ్లీ అనూహ్యంగా టెస్టులకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.

కోహ్లీని అప్పుడు అడగాల్సింది.. విరాట్ టెస్టు రిటైర్మెంట్‌‌పై మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ పర్యటనకు ముందు విరాట్ కోహ్లీ అనూహ్యంగా టెస్టులకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయడం కష్టమే అని సెలెక్టర్లు తెలియజేయడంతోనే అతను రిటైర్మెంట్ ప్రకటించినట్టు తెలుస్తోంది. తాజాగా భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీని ఇంగ్లాండ్ టూరుకు ఎంపిక చేయాల్సిందన్నాడు. పర్యటన ముగిసిన తర్వాత రిటైర్మెంట్‌కు ఒప్పించాల్సిందని చెప్పాడు. ఇంగ్లాండ్‌లో అతని అనుభవం జట్టుకు ఉపయోగపడేదన్నాడు. తానే చీఫ్ సెలెక్టర్ అయితే అదే చేసేవాడనని చెప్పాడు. అలాగే, బుమ్రా వర్క్‌లోడ్‌పై కూడా స్పందించాడు. ఇంగ్లాండ్ టూరు ఎంత ముఖ్యమో తెలిసినప్పుడు బుమ్రాను ఐపీఎల్‌కు దూరంగా ఉంచాల్సిందని తెలిపాడు. ‘ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు బుమ్రా ఫిట్‌గా, ఫ్రెష్‌గా ఉండటం ముఖ్యం. కాబట్టి, ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని బీసీసీఐ, సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ బుమ్రాకు చెప్పాల్సింది. నేను చీఫ్ సెలెక్టర్ అయితే సిరీస్ ప్రాముఖ్యతను వివరించి ముకేశ్ అంబానీని, బుమ్రాను ఒప్పించేవాడిని. వాళ్లు కూడా ఒప్పుకునేవారు.’అని వెంగ్‌సర్కార్ చెప్పుకొచ్చాడు.


Next Story