కివీస్‌ సిరీస్ కోసం 8 వేదికలు షార్ట్ లిస్ట్ చేసిన బీసీసీఐ

by Phanindra |

కివీస్‌ సిరీస్ కోసం 8 వేదికలను బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది. న్యూజిల్యాండ్‌తో భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.

కివీస్‌ సిరీస్ కోసం 8 వేదికలు షార్ట్ లిస్ట్ చేసిన బీసీసీఐ
X

దిశ, స్పోర్ట్స్: కివీస్‌తో భారత్ ఆడే మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీసుల కోసం 8 స్టేడియాలను షార్ట్ లిస్ట్ చేశారు. వచ్చే ఏడాది జనవరిలో జరిగే ఈ వైట్ బాల్ సిరీసుల కోసం నాగ్‌పూర్, గువాహతి, త్రివేండ్రం, ఇండోర్, మొహాలీ, రాజ్‌కోట్, హైదరాబాద్, జైపూర్ సిటీలను షార్ట్ లిస్ట్ చేసినట్లు సమాచారం. ఈ సిరీసుతో భారత హోం క్యాలెండర్ ముగుస్తుంది. అనంతరం భారత్, శ్రీలంక వేదికగా టీ20 వరల్డ్ కప్ మొదలవుతుంది. అయితే కివీస్‌తో సిరీసుకు ముందు స్వదేశంలో వెస్టిండీస్, సౌతాఫ్రికాతో భారత్ సిరీసులు ఆడనుంది. ఈ సిరీసులు జరిగే వేదికలు ఇప్పటికే ఖరారైనట్లు సమాచారం.

జూన్ 14న జరిగే బీసీసీఐ సమావేశంలో కివీస్‌ సిరీస్ వేదికలు కూడా ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలోనే ఐపీఎల్ విక్టరీ సెలబ్రేషన్స్‌కు మార్గదర్శకాలతోపాటు 2025-26 డొమెస్టిక్ క్యాలెండర్‌ను కూడా ఫైనలైజ్ చేయనున్నట్లు సమాచారం. అలాగే వయసు వెరిఫికేషన్ ప్రక్రియలో కూడా మార్పులు చేస్తారని తెలుస్తోంది.

విండీస్‌తో..

టీమిండియాతో రెండు టెస్టులు ఆడేందుకు వెస్టిండీస్ జట్టు భారత్‌కు రానుంది. ఈ రెండు మ్యాచులకు అహ్మదాబాద్, ఢిల్లీ స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

సఫారీలతో..

అలాగే టీమిండియాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు సౌతాఫ్రికా కూడా భారత్‌కు రానుంది. ఈ రెండు టెస్టులకు కోల్‌కతా, గువాహతి ఆతిథ్యం ఇస్తాయి. వన్డేలు రాంచీ, రాయ్‌పూర్, వైజాగ్‌లో జరుగుతాయి. ఐదు టీ20లు వరుసగా కటక్, న్యూ చండీగఢ్, ధర్మశాల, లక్నో వేదికలుగా జరగనున్నాయి.

Next Story