- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంగ్లా టూరుకు వెళ్లడానికి టీమిండియాకు అనుమతి ఇవ్వని కేంద్రం?
టీమిండియా ఆగస్టులో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉంది.

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా ఆగస్టులో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే, ఈ పర్యటన రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. భారత జట్టు బంగ్లాలో పర్యటించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్టు సమాచారం. బంగ్లాలో అనిశ్చిత రాజకీయ పరిస్థితులు నెలకొనడమే అందుకు కారణంగా తెలుస్తోంది. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు బీసీసీఐకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ‘బంగ్లాలో పరిస్థితులు బాగా లేనందున అక్కడికి వెళ్లొద్దని ప్రభుత్వం బీసీసీఐకి సూచించింది. కాబట్టి, బంగ్లా పర్యటన రద్దయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో విడుదల కానుంది.’అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. పరిమిత ఓవర్ల సిరీస్‌లను వాయిదా వేయడమా? లేదా రద్దు చేయడమా? అనే దానిపై త్వరలోనే బీసీసీఐ, బీసీబీ అధికారిక ప్రకటన చేయనున్నాయి. టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వడానికి తాము ఎప్పుడైనా సిద్ధమేనని, ఈ సారి కాకపోతే మరోసారి అవకాశం ఇవ్వాలని బీసీబీ కోరినట్టు కథనాలు పేర్కొన్నాయి. మరోవైపు, టీమిండియా పర్యటనపై అనిశ్చితి నెలకొనడంతో బీసీబీ మీడియా హక్కుల వేలాన్ని నిలిపివేసింది. ముందుగా ఈ నెల 7, 10 తేదీల్లో బిడ్డింగ్ నిర్వహించాలని చూసింది. కానీ, ఆ ప్రణాళికలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.
- Tags
- BCCI
- indian team






