- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గిల్ vs పంత్: టెస్టు కెప్టెన్సీ ఎవరికి?.. తలలు బద్దలు కొట్టుకుంటున్న సెలెక్టర్లు!
గిల్ vs పంత్: టెస్టు కెప్టెన్సీ ఎవరికి ఇవ్వాలి? ఇద్దరితో చర్చించిన తర్వాత సెలెక్టర్లు తలలు బద్దలు కొట్టుకుంటున్నారట.

దిశ, స్పోర్ట్స్: టెస్టులకు రోహిత్ వీడ్కోలు పలకడంతో అతని వారసుడిని వెతికే పనిలో బీసీసీఐ సెలెక్టర్లు పడ్డారు. ఇంగ్లండ్‌లో జట్టుకు నాయకత్వం వహించేది ఎవరనే ప్రశ్న వారికి నిద్రలేకుండా చేస్తోందట. శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ ఇద్దరితో కెప్టెన్సీ గురించి సెలెక్టర్లు చర్చలు జరిపినట్లు సమాచారం. అన్ని టెస్టులు ఆడతాననే నమ్మకం లేకపోవడంతో టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టలేనని జస్‌ప్రీత్ బుమ్రా చెప్పడంతో పంత్, గిల్‌పైనే సెలెక్టర్లు ఫోకస్ పెట్టారట.
విదేశాల్లో గిల్ రికార్డు అంత గొప్పగా లేకపోవడంతో అసలు టెస్టు టీంలో ఇంకా అతని స్థానం పర్మినెంట్ కాలేదని, అలాంటి ప్లేయర్‌ను కెప్టెన్ చేయడం సరికాదని కొందరు సెలెక్టర్లు అంటున్నారు. ప్రస్తుతానికి అతన్ని ఒక సీనియర్ కింద వైస్‌కెప్టెన్‌గా ఉంచితేనే మంచిదని సదరు సెలెక్టర్లు భావిస్తున్నారు. దీంతో ప్రస్తుతానికి ఫ్యూచర్ కెప్టెన్‌పై సెలెక్టర్లు ఒక నిర్ణయానికి రాలేకపోయారు.
రోహిత్ రిటైర్‌మెంట్ ప్లాన్..
ఇదిలా ఉండగా, స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఇంగ్లండ్‌కు వెళ్లినా.. సిరీస్ మధ్యలోనే టెస్టులకు వీడ్కోలు పలకాలని అనుకున్నట్లు సమాచారం. 2014లో ధోనీ చేసినట్లే టోర్నీ మధ్యలో రిటైర్‌మెంట్ తీసుకోవాలని రోహిత్ అనుకున్నాడట. అయితే టూర్ మధ్యలో కెప్టెన్సీ విషయంలో ఇబ్బందులు రాకూడదని భావించిన సెలెక్టర్లు.. అతన్ని కెప్టెన్‌గా ఇంగ్లండ్ పంపలేమని, కావాలంటే ప్లేయర్‌గా పంపుతామని చెప్పారట. దీంతో సిరీస్ ప్రారంభానికి ముందే రోహిత్ తప్పుకున్నాడు.






