- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీసీసీఐ కీలక నిర్ణయం.. అండర్-16 క్రికెటర్లకు సెకండ్ బోన్ టెస్టు
క్రికెట్‌లో ముఖ్యంగా జూనియర్ క్రికెటర్ల వయసు గురించి అనుమానాలు, వివాదాల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, స్పోర్ట్స్ : క్రికెట్‌లో ముఖ్యంగా జూనియర్ క్రికెటర్ల వయసు గురించి అనుమానాలు, వివాదాల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఏజ్ వేరిఫికేషన్ ప్రొగ్రామ్(ఏవీపీ)ని సవరించింది. అండర్16 క్రికెటర్లకు రెండోసారి బోన్ టెస్టు చేయాలని ఇటీవల జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో నిర్ణయించింది. ఇంతకుముందు 14-16 మధ్య వయసు ఉన్న బాయ్స్‌కు బోన్ టెస్టు చేసేవారు. నిర్ధారించిన వయసుకు మరో ఏడాదిని బీసీసీఐ జోడిస్తుంది. ఉదాహరణకు ఒక క్రికెటర్ వయసు 14.8 ఏళ్లుగా నిర్ధారణ అయితే బీసీసీఐ జోడించిన ఏడాదితో 15.8 ఏళ్లు అవుతుంది. అప్పుడు ఆ క్రికెటర్ అండర్-16 వయసు గ్రూపు పోటీకి అర్హత సాధిస్తాడు. అయితే, మరుసటి సంవత్సరం ఆ ప్లేయర్ ఆటోమేటిక్‌గా అండర్-16 కేటగిరీకి అనర్హుడవుతాడు. దీనివల్ల వాస్తవానికి 16 ఏళ్లు ఉన్న ప్లేయర్ కూడా అనర్హవుతున్నాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెకండ్ బోన్ టెస్టు నిర్వహించాలని నిర్ణయించింది.
బోర్డు కొత్త తీసుకొచ్చిన ఏవీపీ గైడ్‌లెన్స్ ప్రకారం..బర్త్ సర్టిఫికేట్ ప్రకారం ఇంకా 16 ఏళ్లలోపే ఉన్న ప్లేయర్‌కు సెకండ్ బోన్ టెస్టు నిర్వహిస్తారు. అందులో వయసు 16 ఏళ్లే అని తేలితే ఆ ప్లేయర్ అండర్-16 కేటగిరీలో కొనసాగుతాడు. 12-15 మధ్య బాలికలకు కూడా ఇదే వర్తిస్తుంది. సాధారణంగా దేశవాళీ సీజన్‌కు ముందు అంటే జూలై, ఆగస్టు నెలలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి రాష్ట్రం నుంచి 40-50 బాయ్స్, 20-25 గర్ల్స్ బోన్ టెస్టులో పాల్గొంటారు. పరీక్షలకు అనుమతించే ముందు ఈ సారి ప్లేయర్ల తాజా ఫొటోతో కూడిన ఆధార్ కార్డును బీసీసీఐ ప్రతినిధులు పరిశీలించనున్నారు. గతంలో కొంతమంది తల్లిదండ్రులు వయసు మోసానికి పాల్పడినట్టు బోర్డు, రాష్ట్ర సంఘాలు గుర్తించాయి. అసలైన ప్లేయర్లకు బదులు వాళ్లకు కంటే చిన్నవారిని టెస్టులకు తీసుకొచ్చినట్టు గుర్తించిన నేపథ్యంలో అలాంటి మోసాలకు చెక్ పెట్టాలని బోర్డు భావిస్తున్నది.






