భారత క్రికెటర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు

by Harish |

భారత క్రికెటర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది.

భారత క్రికెటర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు
X

దిశ, స్పోర్ట్స్ : భారత క్రికెటర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఆడాల్సిందేనని ఆదేశించింది. జాతీయ జట్టు ప్లేయర్లందరూ కనీసంరెండు మ్యాచ్‌లైనా ఆడాలని తెలియజేసింది. ‘న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ మొదలయ్యే నాటికి విజయ్ హజారే ట్రోఫీలో ఒక్కో జట్టు ఆరు మ్యాచ్‌లు ఆడుతుంది. ఏ రెండు మ్యాచ్‌లు ఆడాలనుకునేది ప్లేయర్లు నిర్ణయించుకోవాలి. ఈ ట్రోఫీలో కచ్చితంగా ఆడాలని ఆటగాళ్లకు చెప్పాం.’అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లు ఈ నెల 19తో ముగియనుంది. ఈ నెల 24 నుంచి విజయ్ హాజరే ట్రోఫీ ప్రారంభమవుతుంది. ఇప్పటికే భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ వర్మ, విరాట్ కోహ్లీ ఈ టోర్నీ ఆడతామని ప్రకటించారు. రోహిత్ ముంబైకి, కోహ్లీ ఢిల్లీకి ఆడనున్నట్టు ఆయా రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు తెలియజేశారు. బీసీసీఐ ఆదేశాల నేపథ్యంలో ఇతర క్రికెటర్లు కూడా విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులోకి రానుండటంతో దేశవాళీ టోర్నీ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఎవరైనా ఆటగాడు ఫిట్‌గా లేడని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రకటిస్తే సదరు ఆటగాడికి మినహాయింపు ఉంటుంది.


Next Story