- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై BCCI కీలక ప్రకటన
టెస్టులకు ( Test Matches) విరాట్ కోహ్లీ ( Virat Kohli ) రిటైర్మెంట్ ( Retirement) ప్రకటిస్తాడని ఇవాళ ఉదయం నుంచి వార్తలు

దిశ, వెబ్ డెస్క్: టెస్టులకు ( Test Matches) విరాట్ కోహ్లీ ( Virat Kohli ) రిటైర్మెంట్ ( Retirement) ప్రకటిస్తాడని ఇవాళ ఉదయం నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి. రోహిత్ శర్మ (Rohit Sharma) ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో.. తాను కూడా రిటైర్మెంట్ ఇవ్వాలని విరాట్ కోహ్లీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలికి ( BCCI) కూడా సమాచారం ఇచ్చాడు విరాట్ కోహ్లీ.
అయితే ఈ వార్తలపై తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలికి సంబంధించిన అధికారి స్పందించారు. టెస్ట్ రిటైర్మెంట్ పై విరాట్ కోహ్లీ ఇప్పటికే సమాచారం ఇచ్చాడని పేర్కొన్నాడు సదరు అధికారి. అయితే దీనిపై.. బీసీసీఐ పాలకమండలి భిన్నంగా ఆలోచిస్తుందని తెలిపాడు. విరాట్ కోహ్లీ మంచి ఆటగాడు, ఫిట్నెస్ కూడా బాగుంది.
ఇంకో రెండేళ్ల పాటు టెస్ట్ క్రికెట్ ఆడగల సత్తా కోహ్లీ లో ఉంది అంటూ వ్యాఖ్యానించాడు ఆ బీసీసీఐ అధికారి. ఈ రిటైర్మెంట్ విషయంలో విరాట్ కోహ్లీ తో బీసీసీఐ చర్చిస్తుందని తెలిపాడు. అతని నిర్ణయాన్ని మార్చుకునేలా.. చర్చలు జరుపుతున్నట్లు వివరించాడు. మరి దీనిపై విరాట్ కోహ్లీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇది ఇలా ఉండగా ఇప్పటికే టి20 లకు విరాట్ కోహ్లీ ( Virat Kohli ) రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
A BCCI OFFICIAL ON VIRAT KOHLI:- "Virat Kohli is still incredibly fit and hungry. His presence in Team India's dressing room lifts the entire team. We've requested him to take some time before making a final call on Test Cricket". (NDTV). pic.twitter.com/7kL48vw4PA— Tanuj (@ImTanujSingh) May 10, 2025






