ఐపీఎల్‌లో కొత్త రూల్ తీసుకొచ్చిన బీసీసీఐ.. వారు ఐపీఎల్ ఆడాలంటే?

by Harish |

ఐపీఎల్‌లో బీసీసీఐ కొత్త రూల్ తీసుకొచ్చింది.

ఐపీఎల్‌లో కొత్త రూల్ తీసుకొచ్చిన బీసీసీఐ.. వారు ఐపీఎల్ ఆడాలంటే?
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌లో బీసీసీఐ కొత్త రూల్ తీసుకొచ్చింది. యువ క్రికెటర్లు ఐపీఎల్‌‌లోకి ఎంట్రీ ఇవ్వాలంటే కనీసం ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ అయినా ఆడటాన్ని కచ్చితం చేసింది. ఆదివారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దేశవాళీ క్రికెట్‌ను బలోపేతం చేసేందుకు బోర్డు ఈ నిబంధనను తీసుకొచ్చింది. వచ్చే సీజన్ నుంచి ఈ రూల్‌ను అమలు చేయనుంది. ఐపీఎల్‌లోకి రావడానికి వయసు పరిమితులు లేవు. అండర్-19,అండర్-16 ప్లేయర్లు చాలా మంది ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొన్నారు. కానీ, యువ ఆటగాళ్లు టీ20 క్రికెట్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టడాన్ని విమర్శకులు ఎత్తిచూపారు. దేశవాళీ క్రికెట్‌పై ఐపీఎల్ తీవ్ర ప్రభావం చూపుతుందని మాజీ క్రికెటర్లు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై అండర్-19,అండర్-16 క్రికెటర్లు నేరుగా ఐపీఎల్‌లోకి అడుగుపెట్టలేరు. కచ్చితంగా ఒక్క ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ అయినా ఆడాల్సిందే. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని క్రికెట్ అభిమానులు అభినందిస్తున్నారు. మంచి నిర్ణయం తీసుకుందని, దీని వల్ల సుదీర్ఘ ఫార్మాట్‌లో యువ ప్లేయర్లు నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటారని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story