- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీసీఐ కీలక నిర్ణయం.. దేశవాళీ మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజు పెంపు
దేశవాళీ మహిళా క్రికెటర్లకు బీసీసీఐ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. వారి మ్యాచ్ ఫీజులను గణనీయంగా పెంచింది.

దిశ, స్పోర్ట్స్ : దేశవాళీ మహిళా క్రికెటర్లకు బీసీసీఐ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. వారి మ్యాచ్ ఫీజులను గణనీయంగా పెంచింది. సోమవారం జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌లో మ్యాచ్ ఫీజుల పెంపునకు ఆమోదం లభించింది. ప్రస్తుత మ్యాచ్ ఫీజుల కంటే 2.5 రెట్లు పెంచడం విశేషం. తుది జట్టులో ఉన్న సీనియర్ మహిళా ప్లేయర్‌కు ఇప్పటివరకు రోజుకు రూ 20 వేలు చెల్లించారు. ఇప్పుడు రూ. 50 వేలకు పెరిగింది. బెంచ్‌పై ఉండే సీనియర్ ప్లేయర్‌కు రోజుకు ఇచ్చే మ్యాచ్ ఫీజు రూ.10 వేల నుంచి రూ.25 వేలకు పెంచారు. జాతీయ టీ20 టోర్నీలో తుది జట్టులో ఉన్న వారికి రూ.25 వేలు, రిజర్వ్ ప్లేయర్లకు రూ.12,500 ఇవ్వనున్నారు. దేశవాళీలో టాప్ మహిళా క్రికెటర్ సీజన్ మొత్తం అందుబాటులో ఉంటే దాదాపు రూ.12 లక్షల నుంచి రూ.14 లక్షలు సంపాదించనున్నట్టు బీసీసీఐ అధికారి తెలిపారు.
జూనియర్ మహిళా క్రికెటర్ల రెమ్యునరేషన్‌ను కూడా బీసీసీఐ పెంచింది. అండర్-23, 19 కేటగిరీలో రోజు రూ.25 వేలు, రిజర్వ్ ప్లేయర్లకు రూ.12,500 చెల్లించనున్నారు. రివైజ్డ్ ఫీ స్ట్రక్చర్ ద్వారా అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు కూడా ప్రయోజం పొందనున్నారు. దేశవాలీ టోర్నీల్లో రోజుకు లీగ్ మ్యాచ్‌లకు అంపైర్లు, మ్యాచ్ రిఫరీలకు రూ. 40 వేలు, నాకౌట్ మ్యాచ్‌లకు అయితే రూ.50-60 వేలు ఉంటుంది. ఇక, రంజీ ట్రోఫీలో ఒక్క లీగ్ మ్యాచ్‌కు రూ.1.60 లక్షలు, నాకౌట్ మ్యాచ్‌కు రూ.2.5-3 లక్షలు సంపాదిస్తారు. ఈ వేతన పెంపు దేశవాళీ మహిళా క్రికెటర్లకు భద్రత, ప్రేరణ ఇస్తుందని బీసీసీఐ నమ్ముతుంది.






