- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షేక్ హ్యాండ్ వివాదంపై బీసీసీఐ సంచలన ప్రకటన
పాక్ క్రికెటర్లకు భారత క్రికెటర్లు షేక్ అండ్ ఇవ్వకపోవడంపై స్పందించిన బీసీసీఐ.. షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన పనిలేదని

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన దుబాయ్ మ్యాచ్ లో షేక్ హ్యాండ్ వివాదం ( Handshake Controversy ) తలెత్తిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదంపై తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI) స్పందించింది. షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదని తాజాగా క్లారిటీ ఇచ్చింది బీసీసీఐ. పాక్ క్రికెటర్లకు భారత క్రికెటర్లు షేక్ అండ్ ఇవ్వకపోవడంపై స్పందించిన బీసీసీఐ... రూల్స్ ప్రకారం షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన పనిలేదని తేల్చి చెప్పింది. దీనిపై బీసీసీఐ అధికారి మాట్లాడుతూ... ప్రత్యర్ధులతో షేక్ హ్యాండ్ కు సంబంధించి రూల్ బుక్ లో ఎలాంటి అంశం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇది ఒక గుడ్ విల్ జశ్చర్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఇది చట్టం కాదని... అలాంటి రూల్ లేనప్పుడు సత్సంబంధాలు లేని ప్రత్యర్థికి టీమిండియా షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన పనిలేదని తెలిపారు.






