ఆ లోగా ఆసియా కప్ ట్రోఫీ ఇవ్వకుంటే.. నఖ్వీకి బీసీసీఐ వార్నింగ్

by Harish |

టీమిండియా ఆసియా కప్ విజేతగా నిలిచి నెల అవుతోంది. ట్రోఫీ, మెడల్స్ ఇంకా భారత జట్టుకు అందలేదు.

ఆ లోగా ఆసియా కప్ ట్రోఫీ ఇవ్వకుంటే.. నఖ్వీకి బీసీసీఐ వార్నింగ్
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా ఆసియా కప్ విజేతగా నిలిచి నెల అవుతోంది. ట్రోఫీ, మెడల్స్ ఇంకా భారత జట్టుకు అందలేదు. దీంతో పాక్ క్రికెట్ బోర్డు, ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మొహ్సిన్ నఖ్వీ తీరుపై బీసీసీఐ గుర్రుగా ఉంది. తాజాగా బీసీసీఐ సెక్రెటరీ మొహ్సిన్ నఖ్వీ దీనిపై స్పందించారు. ఒకటి లేదా రెండు రోజుల్లో ట్రోఫీని నఖ్వీ భారత్‌కు అప్పగించే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశాడు. నవంబర్ 4న ఐసీసీ మీటింగ్ జరగనుందని, ఆ లోగా ట్రోఫీ ఇవ్వకపోతే ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ‘నెల రోజులు గడుస్తున్నా ఇంకా ట్రోఫీ అందించకపోవడంపై మేము అసంతృప్తిగా ఉన్నాం. 10 రోజుల క్రితం ఏసీసీ చైర్మన్‌ నఖ్వీకి లేఖ కూడా రాశాం. కానీ, ఎలాంటి ఉపయోగం లేదు. ట్రోఫీని ఇంకా వారి కస్టడీలోని ఉంచుకున్నారు. కానీ, ఒకటి లేదా రెండు రోజుల్లో ట్రోఫీ ముంబైలోని బీసీసీఐ కార్యాలయానికి చేరుకుంటుందని ఆశిస్తున్నాం.’అని సైకియా తెలిపారు.

సెప్టెంబర్ 28న జరిగిన ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఓడించి భారత్ ఆసియా కప్ చాంపియన్‌గా నిలిచింది. అయితే, పహల్గాం ఉగ్రదాడికి నిరసన భారత ఆటగాళ్లు పాక్‌కు చెందిన నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించారు. ఏసీసీ ప్రెసిడెంట్‌గా నఖ్వీ హుందాగా ప్రవర్తించాల్సింది పోయి ట్రోఫీ తన వెంట తీసుకెళ్లిపోవడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ట్రోఫీ కావాలంటే భారత ప్లేయర్ వచ్చి తన చేతుల మీదుగా అందుకోవాలంటూ నాటకాలు ఆడాడు. ఏసీసీ కార్యాలయంలో ఉన్న ట్రోఫీ ఇటీవల అతను తన కస్టడీలోకి తీసుకుని రహస్య ప్రాంతానికి తరలించినట్టు వార్తలు వచ్చాయి. ఐసీసీ మీటింగ్ లోపు ట్రోఫీ అందించకపోతే ఆ మీటింగ్‌లో బీసీసీఐ నఖ్వీ తీరును ఎండగంటాలని భావిస్తున్నది.


Next Story