మ‌రింత ఆల‌స్యంగా ఐపీఎల్ 2026 వేలం... 200కు పైగా ప్లేయ‌ర్ల‌తో !

by velandi.Saikiran |   (  Updated:2025-11-15 22:23:48  IST  )

IPL 2026 డిసెంబర్ 16న మినీ వేలాన్ని నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ముంబైలో కాకుండా అబుదాబీ వేదికగా ఈ మినీ వేలం

మ‌రింత ఆల‌స్యంగా ఐపీఎల్ 2026 వేలం... 200కు పైగా  ప్లేయ‌ర్ల‌తో !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్ అయింది. అందరూ ఊహించినట్లుగానే డిసెంబర్ మాసంలో మినీ వేలం నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి సన్నద్ధమవుతోంది. నవంబర్ 15 అంటే నిన్నటితో రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. ఇక ఇప్పుడు అందరికన్నా ఐపీఎల్ 2026 మినీ వేలం పైన పడింది.

డిసెంబర్ 16వ తేదీన ఈ మినీ వేలాన్ని నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ముంబైలో కాకుండా అబుదాబీ వేదికగా ఈ మినీ వేలం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మినీ వేలం కేవలం 77 స్లాట్ల కోసం జరుగుతోంది. ఈ 77 స్లాట్ల‌ కోసం 200కు పైగా ప్లేయర్లు పోటీపడే ఛాన్సులు కనిపిస్తున్నాయి. వేలంలోకి రిలీజ్ అయిన ప్లేయర్లతో పాటు కొత్త‌గా ఐపిఎల్ వేలానికి దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఉంటారు. అలా మొత్తం 200కు పైగా మంది క్రికెటర్లు కావచ్చు. మ‌రి ఇందులో ఎవ‌రు ఎంత ప‌లుకుతారో చూడాలి.

Next Story