ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్..భారత జట్టు ప్రకటన

by velandi.Saikiran |   (  Updated:2026-05-19 11:48:28  IST  )

ఆఫ్ఘనిస్తాన్ తో మూడు వన్డేలు, ఓ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధం కానుంది భారత జట్టు.

ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్..భారత జట్టు ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 ముగియగానే మరో అంతర్జాతీయ టోర్నమెంట్ ఆడనుంది భారత జట్టు. ఆఫ్ఘనిస్తాన్ తో మూడు వన్డేలు, ఓ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధం కానుంది. జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న ఈ సిరీస్ ల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటన చేసింది. దాదాపు 15 రోజుల పాటు ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే వ‌న్డేలు, టెస్ట్ కోసం భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ క్రమంలో బుమ్రాకు రెస్ట్ ఇచ్చిన బీసీసీఐ... వన్డేల కోసం రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలను ఎంపిక చేసింది.

అయితే ఈ ఇద్దరు ఫిట్ నెస్ నిరూపించుకుంటేనే సిరీస్ ఆడేందుకు వెళతారు. ఒకవేళ విఫలమైతే, వీళ్ళ స్థానంలో మరో ఇద్దరు ఎంట్రీ ఇస్తారు. అదే సమయంలో మహమ్మద్ షమీ గురించి సెలక్షన్ కమిటీ ఏ మాత్రం పట్టించుకోలేదు. రవీంద్ర జడేజా కు రెస్ట్ ఇచ్చిన బీసీసీఐ... అక్షర్ పటేల్, ఆకాష్ దీప్ లను పక్కకు పెట్టింది. అయితే రిషబ్ పంత్ కు టెస్టులో అవకాశం వచ్చినప్పటికీ అతని వైస్ కెప్టెన్సీని మాత్రం పీకి పారేశారు. కే ఎల్ రాహుల్ కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.


భారత టెస్ట్ స్క్వాడ్: గిల్ (కెప్టెన్), జైస్వాల్, రాహుల్ (వైస్ కెప్టెన్‌), సాయి సుదర్శన్, పంత్, పడిక్కల్, నితీష్, సుందర్, కుల్దీప్, సిరాజ్, ప్రసిద్ధ్, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, జురెల్ (కీప‌ర్‌)

వన్డేల స్క్వాడ్- శుభ్‌మన్ గిల్, రోహిత్, విరాట్, అయ్యర్, కెఎల్ రాహుల్, ఇషాన్, హార్దిక్, నితీష్ రెడ్డి, సుందర్, కుల్దీప్, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హ‌ర్ష్‌ దూబే

Next Story