బీసీసీఐ ఆదాయం రూ.9,741 కోట్లు.. ఐపీఎల్ నుంచి ఎంత సంపాదించిందో తెలుసా?

by Harish |

వరల్డ్ క్రికెట్‌లో ఇప్పటికే రిచెస్ట్ బోర్డుగా పేరుగాంచిన బీసీసీఐ 2023-24 ఫైనాన్షియల్ ఇయర్‌లో రికార్డు రెవెన్యూ సాధించింది.

బీసీసీఐ ఆదాయం రూ.9,741 కోట్లు.. ఐపీఎల్ నుంచి ఎంత సంపాదించిందో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : వరల్డ్ క్రికెట్‌లో ఇప్పటికే రిచెస్ట్ బోర్డుగా పేరుగాంచిన బీసీసీఐ 2023-24 ఫైనాన్షియల్ ఇయర్‌లో రికార్డు రెవెన్యూ సాధించింది. బీసీసీఐ ఆదాయంపై రీడిఫ్యూజన్ యాడ్ ఏజెన్సీ తాజాగా నివేదికను రిలీజ్ చేసింది. దాని ప్రకారం.. గత క్యాలెండర్ ఇయర్‌లో బీసీసీఐ రూ. 9,741 కోట్ల ఆదాయం ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు రూ.3 వేల కోట్లు ఎక్కువ. 2022-23లో బోర్డు 6,820 కోట్లు సంపాదించింది. 2021-22లో రూ.4,230 కోట్లు ఖజానాకు చేరాయి. ఆ ఫైనాన్షియల్ ఇయర్‌తో పోలిస్తే రూ.5 వేలకుపైగా ఆర్జించడం బీసీసీఐ గణనీయమైన వృద్ధిని సూచిస్తుంది.

ఐపీఎల్ వాటానే 59 శాతం

బీసీసీఐకి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) బంగారు గుడ్డు పెట్టే బాతు అని మరోసారి స్పష్టమైంది. ఐపీఎల్ ద్వారానే బోర్డు రూ.5,741 కోట్లు సంపాదించింది. బీసీసీఐ మొత్తం ఆదాయంలో ఐపీఎల్ వాటా 59 శాతం కావడం విశేషం. 2007లో ప్రారంభమైన ఐపీఎల్ సీజన్‌ సీజన్‌కు తన విలువను పెంచుకోవడంతోపాటు బీసీసీఐపై కనవర్షం కురిపిస్తోంది. ఐసీసీ నుంచి బీసీసీఐ షేర్ కింద రూ.1041 కోట్లు ఖజానాలో చేరాయి. పెట్టుబడుల ద్వారా రూ.987 కోట్లు రాగా.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) నుంచి రూ.378 కోట్లు వచ్చాయి. ఐపీఎల్ యేతర మీడియా హక్కుల నుంచి బీసీసీఐ రూ.361 కోట్లు సంపాదించింది. ఈ మొత్తం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు, టోర్నమెంట్‌ల బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల ద్వారా వచ్చింది. టికెట్ల విక్రయం, కమర్షియల్ రైట్స్ ద్వారా మరో రూ.361 కోట్లు ఖజానాలో చేరాయి.


Next Story