- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BCCI: బీసీసీఐ మరో షాకింగ్ నిర్ణయం.. టీమిండియా కోచింగ్ స్టాఫ్‌పై వేటు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో టీమిండియా (Team India) ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో టీమిండియా (Team India) ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ (England) పర్యటనకు ముందు బీసీసీఐ (BCCI) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మొత్తం నలుగురు కోచింగ్ స్టాఫ్ (Coaching Staff)ను విధుల నుంచి తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది. అందులో ఇటీవల హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు అసిస్టెంట్ కోచ్ బాధ్యతలు స్వీకరించిన అభిషేక్ నాయర్ (Abhishek Nair) కూడా ఉన్నారు. ఇక జాతీయ జట్టుతో మూడేళ్ల పదవీ కాలం పూర్తి చేసిన సిబ్బంది ఫీల్డింగ్ కోచ్‌లు దిలీప్ (Dilip), దేశాయ్ (Desai)తో పాటు ట్రైన్ సోహమ్ (Soham)లను విధుల నుంచి తప్పించింది. అయితే, గతేడాది న్యూజిలాండ్ (New Zealand), ఆస్ట్రేలియా (Australia)తో జరిగిన టెస్ట్ సిరీస్‌లలో భారత జట్టు వరుస పరాజయాలను చవిచూసిన నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే, అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన కేవలం 8 నెలల వ్యవధిలోనే అభిషేక్ నాయర్ (Abhishek Nair)ను విధుల నుంచి తొలగించడం ప్రస్తుతం భారత క్రికెట్‌లో చర్చనీయాంశంగా మారింది.






