- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాలుగో టెస్ట్ కు టీమిండియా రెడీ.. తుది జట్టు ఇదే !
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మరో మూడు రోజుల్లోనే... నాలుగో టెస్ట్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నాలుగో టెస్ట్

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మరో మూడు రోజుల్లోనే... నాలుగో టెస్ట్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నాలుగో టెస్ట్ మాంచెస్టర్ వేదికగా జరగనుంది. అయితే ఈ టెస్ట్ నేపథ్యంలో... టీమిండియా లో భారీ మార్పులు జరగనున్నట్లు చెబుతున్నారు. అలాగే ఫామ్ లేక సతమతమవుతున్న ప్లేయర్లను కూడా... టీమిండియా పక్కకు పెట్టే ఆలోచనలో ఉంది.
ముఖ్యంగా తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి, ఆకాష్ దీప్ అలాగే అర్ష్ దీప్ సింగ్ ముగ్గురు గాయాలపాలయ్యారు. దీంతో ఈ ముగ్గురు ప్లేయర్లు నాలుగో టెస్ట్ కు దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది. వారి స్థానంలో జట్టులోకి ఎవరు వస్తారు ? అనే టెన్షన్ అందరిలోనూ నెలకొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం...అర్ష్ దీప్ సింగ్ స్థానంలో... అన్షుల్ కాంబోజ్ జట్టులోకి వస్తాడని అంటున్నారు.
అలాగే ఆకాష్ దీప్ స్థానంలో కుల్దీప్ తుది జట్టులోకి వస్తాడని అంటున్నారు. నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో ఎలాగూ ఇద్దరు ఆల్రౌండర్లు ఉన్నారు. వాషింగ్టన్ సుందర్ అలాగే జడేజా ఇద్దరు కొనసాగుతున్నారు. ఇక.. కరుణ్ నాయర్ నాలుగో టెస్ట్ కు దూరంగా ఉండబోతున్నాడని సమాచారం. అతని స్థానంలో సాయి సుదర్శన్ తిరిగి జట్టులోకి చేరబోతున్నాడు.
నాల్గవ టెస్టు కోసం భారత జట్టు అంచనా: శుభ్‌మన్ గిల్ (C), రిషబ్ పంత్ (WK), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అన్షుల్ కాంబోజ్






