- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశ్వవిజేతగా భారత మహిళల క్రికెట్ జట్టు.. భారీ నజరానా ప్రకటించిన BCCI
by Kema Shiva Kumar |
వన్డే ఉమెన్స్ వరల్డ్ కప్‌లో భాగంగా ముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ పోరులో భారత మహిళల క్రికెట్ జట్టు 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: వన్డే ఉమెన్స్ వరల్డ్ కప్‌లో భాగంగా ముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ పోరులో భారత మహిళల క్రికెట్ జట్టు 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్‌ప్రీత్ సేన 50 ఓవర్లలో 298/7 పరుగులు చేసింది. షఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58) చెలరేగారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అవ్వడంతో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఈ క్రమంలోనే బీసీసీఐ భారత మహిళల క్రికెట్ జట్టుకు భారీ నజరానా ప్రకటించింది. ఈ మేరకు జట్టు మొత్తానికి రూ.51 కోట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధికారికంగా వెల్లడించాడు.
Next Story






