2025లో టీమ్ ఇండియా హోం షెడ్యూల్ ఇదే

by Ajay Maddhiboyina |   (  Updated:2025-04-03 05:45:24  IST  )

వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలు, ఐదు టీ20లతో పాటు రెండు టెస్టులు ఆడుతుంది.

2025లో టీమ్ ఇండియా హోం షెడ్యూల్ ఇదే
X

- అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్

- నవంబర్, డిసెంబర్లలో దక్షిణాఫ్రికాతో సిరీస్

- విడుదల చేసిన బీసీసీఐ

దిశ, స్పోర్ట్స్: భారత క్రికెట్ పురుషుల జట్టు 2025 సీజన్‌లో హోంలో ఆడే సిరీస్‌లను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. రాబోయే సీజన్‌లో టెస్టులు, వన్డేలతో పాటు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఆడుతుంది. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు ఇండియాలో పర్యటించనున్నాయి. అక్టోబర్ 2న వెస్టిండీస్‌తో జరిగే టెస్టు మ్యాచ్‌తో హోమ్ సిరీస్ ప్రారంభం కానుంది. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలు, ఐదు టీ20లతో పాటు రెండు టెస్టులు ఆడుతుంది. అయితే నవంబర్‌లో దీపావళి ముగిసిన తర్వాత ఢిల్లీలో టెస్టు మ్యాచ్ నిర్వహిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా ఉంటుంది. ఇక దీపావళి తర్వాత ఇది మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. పైగా చలికాలం కూడా కావడంతో విజిబిలిటీ తక్కువగా ఉంటుందనే విమర్శలు వస్తున్నాయి.

ఇదే టీమ్ ఇండియా హోం షెడ్యూల్

వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్

తొలి టెస్టు : అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 6 - అహ్మదాబాద్

రెండో టెస్టు : అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 15 - కోల్‌కతా

దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్

తొలి టెస్టు : నవంబర్ 14 నుంచి నవంబర్ 18 - న్యూఢిల్లీ

రెండో టెస్టు : నవంబర్ 22 నుంచి నవంబర్ 26 - గౌహతీ

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్

తొలి వన్డే : నవంబర్ 30 - రాంచి

రెండో వన్డే: డిసెంబర్ 3 - రాయ్‌పూర్

మూడో వన్డే : డిసెంబర్ 6 - వైజాగ్

* మ్యాచ్‌లు అన్నీ మధ్యాహ్నం 1.30 ప్రారంభమవుతాయి.

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్

తొలి టీ20 : డిసెంబర్ 9 - కటక్

రెండో టీ20 : డిసెంబర్ 11 - న్యూ చండీగఢ్

మూడో టీ20 : డిసెంబర్ 14 - ధర్మశాల

నాలుగో టీ20 : డిసెంబర్ 17 - లక్నో

ఐదో టీ20 : డిసెంబర్ 19 - అహ్మదాబాద్

* మ్యాచ్‌లన్నీ రాత్రి 7.00 గంటలకు ప్రారంభమవుతాయి.

Next Story