- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంగ్లండ్ టూరులో హర్షిత్ రాణా.. చివరి నిమిషంలో యాడ్ చేసిన బీసీసీఐ!
ఇంగ్లండ్ టూరులో ఆడే భారత జట్టులో హర్షిత్ రాణాను చేర్చినట్లు బీసీసీఐ ప్రకటించింది. చివరి నిమిషంలో అతన్ని కవర్‌గా యాడ్ చేశామంది.

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడేందుకు 18 మందితో కూడిన జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. చివరి క్షణంలో ఈ జట్టుకు మరో ప్లేయర్‌ను జత చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఆస్ట్రేలియాలో ఆడిన బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణాను జట్టుతో చేర్చారు. మొదటి మూడు టెస్టుల్లో మాత్రమే తను ఆడతాడని సమాచారం. అతన్ని ట్రావెల్ రిజర్వ్ లేదా కవర్‌గా జట్టుతో చేర్చినట్లు బీసీసీఐ తెలిపింది. జూన్ 20 నుంచి మొదలయ్యే తొలి టెస్టులో ఐదుగురు బౌలర్లతో టీమిండియా బరిలో దిగాలని అనుకుంటోందని, అందుకే రాణాను టీంలో చేర్చారని సమాచారం.
అతనితోపాటు ఇంగ్లండ్‌లో ప్రాక్టీస్ మ్యాచులు ఆడిన ఇండియా-ఎ జట్టు సభ్యులంతా స్వదేశానికి తిరిగొచ్చేశారు. అయితే టెస్టు క్రికెట్లో రాణా రికార్డు అంత గొప్పగా లేదు. ఇటీవల ఆడిన ప్రాక్టీస్ మ్యాచుల్లో కూడా ఘోరంగా విఫలమయ్యాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచులో 99 పరుగులిచ్చి ఒకే ఒక్క వికెట్ తీసుకున్నాడు. గతేడాది ఆస్ట్రేలియా టూర్‌లో టెస్టు అరంగేట్రం చేసిన రాణా.. ఓవరాల్‌గా 50.75 సగటుతో కేవలం నాలుగు వికెట్లే తీసుకోవడం గమనార్హం.
అయితే కేకేఆర్‌కు మెంటార్‌గా ఉన్న సమయంలో రాణాతో గంభీర్‌కు మంచి ఫ్రెండ్‌షిప్ ఏర్పడిందని, అందుకే రాణాను జట్టులో చేర్చాలని గంభీర్ సిఫారసు చేశాడని కూడా కొందరంటున్నారు. హెడ్ కోచ్ ఇలా అడగడంతో బీసీసీఐ కూడా దీనికి ఒప్పుకున్నట్లు సమాచారం. మరి ఆస్ట్రేలియాలో అవకాశాన్ని వృధా చేసుకున్న రాణా.. ఇంగ్లండ్‌లో అయినా రాణిస్తాడేమో చూడాలి.






