- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BBL: టీ20 మ్యాచ్‌లో ఊచకోత.. ఏకంగా 515 పరుగులు 36 సిక్సులు
క్రికెట్ చరిత్రలో నిలిచిపోయేలా సాగిన బిగ్‌బాష్ లీగ్ (BBL) 15వ సీజన్ 6వ మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ అద్భుతం సృష్టించింది.

దిశ, వెబ్ డెస్క్: క్రికెట్ చరిత్రలో నిలిచిపోయేలా సాగిన బిగ్‌బాష్ లీగ్ (BBL) 15వ సీజన్ 6వ మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ అద్భుతం సృష్టించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 257/6 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఫిన్ అలెన్ (79), కూపర్ కానోలీ (77) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించారు. ఏకంగా 18 సిక్సర్లు బాదిన పెర్త్ జట్టు, బిగ్‌బాష్ చరిత్రలోనే మూడవ అత్యధిక స్కోరును నమోదు చేసింది. అంత పెద్ద స్కోరు చూసి మ్యాచ్ పెర్త్ కైవసం అనుకున్నారంతా. కానీ, బ్రిస్బేన్ హీట్ బ్యాటర్లు అసాధ్యమైన దానిని సుసాధ్యం చేసి చూపించారు.
లక్ష్య ఛేదనలో తొలి బంతికే ఓపెనర్ కోలిన్ మన్రో (Colin Monroe) వికెట్ కోల్పోయినప్పటికీ, జాక్ వైల్డర్‌ముత్ (54 బంతుల్లో 110 నాటౌట్), మాట్ రెన్‌షా (51 బంతుల్లో 102) విశ్వరూపం ప్రదర్శించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు రికార్డ్ స్థాయిలో 213 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడమే కాకుండా, చెరో 9 భారీ సిక్సర్లు బాది గబ్బా స్టేడియంను హోరెత్తించారు. టీ20 చరిత్రలో ఒకే ఛేజింగ్‌లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇదే మొదటిసారి. ఈ మెరుపు దాడితో మరో బంతి మిగిలి ఉండగానే బ్రిస్బేన్ హీట్ 258 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బిగ్‌బాష్ చరిత్రలో 230 పరుగుల పాత రికార్డును తుడిచిపెట్టి, ఇది అత్యధిక పరుగుల ఛేజింగ్‌గా చరిత్ర సృష్టించింది.






