టీమిండియా నాట‌కాలు...బ‌వుమా కొడుకు సీరియ‌స్‌

by velandi.Saikiran |

టీమిండియా మహిళ‌ల జ‌ట్టుపై ద‌క్షిణాఫ్రికా స్టార్ ఆట‌గాడు బ‌వుమా కొడుకు సీరియ‌స్ అయ్యాడు. టీమిండియా ఛీటింగ్ చేస్తోంద‌ని

టీమిండియా నాట‌కాలు...బ‌వుమా కొడుకు సీరియ‌స్‌
X

దిశ‌, వెబ్ డెస్క్ : టీమిండియా మహిళ‌ల జ‌ట్టుపై ద‌క్షిణాఫ్రికా స్టార్ ఆట‌గాడు బ‌వుమా కొడుకు సీరియ‌స్ అయ్యాడు. టీమిండియా ఛీటింగ్ చేస్తోంద‌ని చుర‌క‌లు అంటించాడు. ఈ మేర‌కు త‌న కొడుకు ఫైర్ అవుతున్న‌ట్లు బ‌వుమా ( Temba Bavuma ) పోస్టు పెట్టాడు. ఈ సంఘ‌ట‌న ఇప్పుడు వైర‌ల్ గా మారింది. వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్న‌మెంట్ లో భాగంగా గురువారం టీమిండియా వ‌ర్సెస్ దక్షిణాఫ్రికా మ‌హిళ‌ల జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఇందులో సౌతాఫ్రికా విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్ లో చాలా క‌ష్ట‌ప‌డి స‌ఫారీలు గెలిచారు. అయితే మ్యాచ్ చేజారే పరిస్థితుల నేపథ్యంలో టీమిండియా వికెట్ కీపర్ రిచా ఘోష్‌ కు చిన్న గాయమైంది. ఆ సమయంలో సౌతాఫ్రికా 21 బంతుల్లో 24 పరుగులు చేయాల్సి ఉంది.

దీంతో ఫిజియోథెరపిస్టు వచ్చి, రిచా ఘోష్‌ కు ప్రథమ చికిత్స అందించారు. దీంతో సౌతాఫ్రికా ప్లేయర్లు కాస్త ఏకాగ్రత కోల్పోయారు. అనంతరం మ్యాచ్ ప్రారంభమైన తర్వాత సౌతాఫ్రికా కాస్త తడబడినా, చివరికి గెలిచింది. అయితే టీ20 వరల్డ్ కప్ 2024 సమయంలో రిషబ్ పంత్ కూడా ఇలాగే, సౌతాఫ్రికా ప్లేయర్ల ఏకగ్రత దెబ్బతీసి మ్యాచ్ విజయానికి దోహదపడ్డాడు. నిన్నటి టీం మీడియా వర్సెస్ సౌతాఫ్రికా మహిళల మ్యాచ్ లో కూడా అదే పరిస్థితి నెలకొంది. కానీ ఈసారి టీమిండియా ఓడిపోయి స‌ఫారీ జ‌ట్టు గెలిచింది. ఈ ఎపిసోడ్ నేపథ్యంలోనే బ‌వుమా ( Temba Bavuma ) సీరియస్ అయ్యాడు. టీమిండియా ప్లేయర్లు ప్రతిసారి ఇలాగే నాటకాలు ఆడుతున్నారని, కానీ ఈసారి మేం గెలిచామని పోస్ట్ పెట్టే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగానే తన కొడుకు సీరియస్ అయినట్లుగా పోస్ట్ పెట్టి తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

Next Story