- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో రెచ్చిపోయిన బ్యాటర్లు.. భారత్ భారీ స్కోర్
ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు. నిర్ణీత 50 ఓవర్లలో 298 పరుగుల భారీ స్కోర్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ (ICC Women's ODI World Cup) లో భాగంగా ఫైనల్ మ్యాచ్ సౌతాఫ్రికా, భారత్ జట్ల మధ్య జరుగుతుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకోవడంతో.. భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు షెఫాలి వర్మ, స్మృతి మంధాన మంచి భాగస్వామ్యం అందించారు. మొదటి వికెట్‌కు ఏకంగా 104 పరుగుల భాగ స్వామం రాగా మంధాన 45 పరుగులకు అవుట్ అయింది. అలాగే రెండో వికెట్ కు 62 పరుగుల భాగస్వామ్యం రాగా షెఫాలి వర్మ 166 పరుగుల వద్ద.. 87 పరుగులకు అవుట్ కావడంతో సెంచరీ మిస్ చేసుకుంది. అనంతరం జెమిమా 24, హర్మన్ ప్రీత్ కౌర్ 20, పరుగుల వద్ద అవుట్ అయ్యారు.
అలాగే అమన్జోత్ కౌర్ 12 పరుగుల మాత్రమే చేసి అవుట్ కాగా ఆల్ రౌండర్ దీప్తి శర్మ, రిచా ఘోష్ సౌతాఫ్రికా బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. దీప్తి శర్మ 58 రాణించిగా,, రిచా 34 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి అవుట్ అయింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయిన భారత మహిళల జట్టు 298 పరుగులు చేసింది. ఈ మ్యాచులో సౌతాఫ్రికా జట్టు గెలవాలంటే 50 ఓవర్లలో 299 పరుగులు చేయాల్సి ఉంది. మరీ భారత్ నిర్దేశించిన ఈ భారీ స్కోరును సౌతాఫ్రికా జట్టు చేజ్ చేస్తుందో లేదో తెలియాలంటే చివరి వరకు వేచి చూడాల్సిందే.






