- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Heart Attack : సిక్స్ కొట్టిన వెంటనే కుప్పకూలాడు.. గుండెపోటుతో యువ క్రికెటర్ మృతి
ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చే ఆటగాళ్లు కూడా గుండె పోటుకు గురవుతున్నారు.

దిశ, స్పోర్ట్స్ : హార్ట్ ఎటాక్ ఎప్పుడు వస్తుందో? తెలియని పరిస్థితి. ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చే ఆటగాళ్లు కూడా గుండె పోటుకు గురవుతున్నారు. తాజాగా క్రికెట్ ఆడుతూ ఓ యువ క్రికెటర్ హార్ట్ ఎటాక్‌తో మరణించాడు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో జరిగిన ఓ లోకల్ క్రికెట్ మ్యాచ్‌లో ఈ విషాదం నెలకొంది. ఆ బ్యాటర్‌ను ఫిరోజ్‌పుర్‌కు చెందిన హర్జీత్ సింగ్‌గా గుర్తించినట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. హర్జీత్ సింగ్ బ్యాటింగ్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. సిక్స్ కొట్టిన తర్వాత నాన్ స్ట్రైకర్‌తో మాట్లాడటానికి పిచ్ మధ్యలోకి వెళ్లాడు. అలసటతో కాసేపు పిచ్‌పై కూర్చున్న అతను ఉన్నట్టుండి కిందపడిపోయాడు. ఇతర క్రికెటర్లు వెంటనే అతనికి సీపీఆర్ చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల కాలంలో క్రికెటర్లు గుండెపోటు బారినపడుతున్నారు. బంగ్లాదేశ్ స్టార్ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్ ఇటీవల మైదానంలోనే కుప్పకూలిన విషయం తెలిసిందే. సకాలంలో అతనికి చికిత్స అందడంతో ప్రాణ గండం నుంచి బయటపడ్డాడు.
ख़ौफ़नाक दृश्य।
— Ankit Rajput (@AnkitKu50823807) June 29, 2025
पंजाब के फिरोजपुर में क्रिकेट खेलते वक़्त एक खिलाड़ी ने जैसे ही ज़बरदस्त छक्का मारा,
अचानक दिल का दौरा पड़ा और उसी मैदान पर दम तोड़ दिया।
ज़िंदगी वाकई पल भर की मेहमान है… 🕯️#Firozpur #HeartAttack #Cricketer pic.twitter.com/AsM3evT01T






