- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Basketball Fight: లాస్ ఏంజిల్స్ లేకర్స్‌పై షికాగో బుల్స్ సూపర్ విక్టరీ
ఎన్‌బీఏ టోర్నీలో భాగంగా షికాగో బుల్స్ జట్టు లాస్ ఏంజిల్స్ లేకర్స్ జట్టుపై అద్భుత విజయం సాధించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఎన్‌బీఏ (NBA) సీజన్‌లో భాగంగా జరిగిన హోరాహోరీ పోరులో షికాగో బుల్స్ జట్టు 142-130 స్కోర్ తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ఈ మ్యాచ్‌లో లాస్ ఏంజిల్స్ లేకర్స్‌ను బుల్స్ మట్టికరిపించింది. మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్లు పాయింట్ల కోసం పోటాపోటీగా తలపడ్డాయి. ఆక స్టార్ ప్లేయర్లతో బరిలోకి దిగిన లేకర్స్ జట్టు, బుల్స్ వ్యూహాత్మక ఆట తీరు ముందు తలవంచక తప్పలేదు. ముఖ్యంగా డిఫెన్స్ విభాగంలో లేకర్స్ చేసిన పొరపాట్లు వారికి భారీ నష్టాన్ని చేకూర్చాయి.
షికాగో బుల్స్ ఆటగాళ్లు అటాకింగ్ గేమ్‌తో ప్రత్యర్థి జట్టుపై తీవ్ర ఒత్తిడి పెంచారు. నిర్ణీత సమయం ముగిసేసరికి స్పష్టమైన ఆధిక్యంతో విజేతగా నిలిచారు. బుల్స్ జట్టులోని టాప్ స్కోరర్లు వరుస బాస్కెట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. లేకర్స్ స్టార్ ఆటగాళ్లు ప్రయత్నించినప్పటికీ ఓటమిని అడ్డుకోలేకపోయారు.






