పాక్‌కు షాకిచ్చిన బంగ్లా.. థ్రిల్లింగ్ విక్టరీతో టీ20 సిరీస్ కైవసం

by Phanindra |

మూడు మ్యాచుల టీ20 సిరీసులో పాక్‌కు బంగ్లాదేశ్ గట్టి షాకిచ్చింది. థ్రిల్లింగ్ విక్టరీతో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది.

పాక్‌కు షాకిచ్చిన బంగ్లా.. థ్రిల్లింగ్ విక్టరీతో టీ20 సిరీస్ కైవసం
X

దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్ గట్టి షాకిచ్చింది. మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు టీ20ల సిరీసును కైవసం చేసుకుంది. మిర్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో 8 పరుగుల తేడాతో ఉత్కంఠ భరిత విజయం సాధించింది. బౌలర్లకు మంచి సహకారం లభించిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌట్ అయింది. 134 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన పాకిస్తాన్‌ను బంగ్లా బౌలర్లు దెబ్బ మీద దెబ్బ కొట్టారు.

పాక్ టాపార్డర్ మరోసారి దారుణంగా విఫలమవడంతో తొలి పవర్‌ప్లే ముగిసే సరికి 6 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి కేవలం 17 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే చివర్లో ఫహీమ్ అష్రాఫ్ (51) కొంత పోరాడగా.. ఖుష్దిల్ షా (13), అబ్బాస్ అఫ్రిదీ (19), అహ్మద్ దానియల్ (17) అతనికి కొంత సహకరించారు. 19వ ఓవర్లో ఫహీమ్ అవుటవడంతో పాక్ ఆశలు ఆవిరయ్యాయి. దీంతో పాక్ జట్టు 19.2 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ అయింది. 8 పరుగుల తేడాతో విజయం సాధించిన బంగ్లాదేశ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో సిరీస్ తన ఖాతాలో వేసుకుంది.

Next Story