- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : ఇటీవల భారత్, బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సంబంధాలు క్షీణించాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఆ దేశ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి బీసీసీఐ తప్పించడం చర్చనీయాంశమైంది. బంగ్లాదేశ్ కూడా భారత్‌లో ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడంతో వివాదం ముదిరింది. అయితే, బీసీసీఐతో సత్సంబంధాలను పునరుద్ధరించుకోవాలని బంగ్లా క్రికెట్ బోర్డు(బీసీబీ) చూస్తోంది. సెప్టెంబర్‌లో టీమ్ ఇండియా పర్యటనను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా బీసీసీఐకి బీసీబీ లేఖ రాసినట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. ‘అవును. బంగ్లా క్రికెట్ బోర్డు బీసీసీఐకి లేఖ రాసింది. సెప్టెంబర్‌లో బంగ్లాలో భారత జట్టు పర్యటన గురించే కాకుండా వచ్చే ఏడాది బీసీబీ ఆతిథ్యమిస్తున్న ఆసియా కప్ గురించి లేఖలో ప్రస్తావించింది.’అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. టీమిండియా మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయం, డిజిటల్ బ్రాడ్ కాస్ట్ రైట్స్ అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం ద్వారా బోర్డు ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవాలని బీసీబీ భావిస్తున్నది.






